
ట్యాగ్ · 329 కథనాలు · పేజీ 13


టాలీవుడ్ కు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ

30 వసంతాల "ఆదిత్య 369"

సెట్ లో అడుగుపెట్టిన 'అఖండ'

"అఖండ " షూటింగ్ ఫైనల్ షెడ్యూల్

వినాయక చవితికి "అఖండ "?

#NBK107 లో క్రాక్ విలన్..!

తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్

బాలకృష్ణకు చిరు, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

#NBK107 మూవీ అనౌన్స్ మెంట్

'అఖండ' బర్త్ డే పోస్టర్ రిలీజ్

అభిమానులకు 'బాలయ్య' రిక్వెస్ట్

ఎన్టీఆర్ పై బుక్ రాస్తా

'ఎన్టీఆర్ జయంతి'కి బాలయ్య శ్రీరామ దండకం

సర్పైజ్ కోసం చూడమంటున్న బాలయ్య

'అఖండ' టీజర్ ట్రీట్ అప్పుడేనా..?

"అఖండ " లో శ్రీకాంత్ , పూర్ణ స్పెషల్ ఎట్రాక్షన్

మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ

‘అఖండ’ ట్రైలర్ ఆరోజు లేదు.. నిర్మాత క్లారిటీ

స్పీడుమీదున్న 'బాలయ్య'
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు ఒక్క సినిమాలు చేస్తుంటే వీళ్లు మాత్రం ఒక్కోక్కరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.ఈసినిమాత తరువాత గోపిచంద్ మలినేని తో మరొక సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు గోపిచంద్ మలినేని. అఖండ అయిపోయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

టాలీవుడ్ కు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కై నందమూరి అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షక , అభిమానులకు హాట్ టాపిక్ గా ఉంది. హీరో బాలకృష్ణ తన పుట్టినరోజున ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ బాలకృష్ణ అభిమానులను సర్ ప్రైజ్ చేశారు.

30 వసంతాల "ఆదిత్య 369"
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ , మోహిని జంటగా టైమ్ మిషన్ నేపథ్యంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ "ఆదిత్య 369 "మూవీ 1991సంవత్సరం జూలై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో బాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. దర్శకుడు సింగీతం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా "ఆదిత్య 369" మూవీ ని తెరకెక్కించారు.

సెట్ లో అడుగుపెట్టిన 'అఖండ'
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు వరుసగా సినిమాల షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు రెడీగా ఉన్న చిత్రాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈనేపథ్యంలో బాలకృష్ణ కూడా సెట్ లోకి అడుగుపెట్టాడు. ఈరోజు హైదరాబాదులో ఈ చిత్రం తుది షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. `అఖండ` షూటింగ్ రీ స్టార్ట్ చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఏకంగా సెట్‌లోని ఓ పోస్టర్‌ని పంచుకుంది యూనిట్. అఘోర లుక్‌లో బాలయ్య కనిపిస్తున్నాడు. హీరో బాలకృష్ణపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేసి విడుదల చేసేందుకు రెడీ…

"అఖండ " షూటింగ్ ఫైనల్ షెడ్యూల్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “అఖండ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయం లో కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

వినాయక చవితికి "అఖండ "?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన" అఖండ" టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

#NBK107 లో క్రాక్ విలన్..!
తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు ఇప్పుడు తెలుగులో మంచి అవకాశాలే ఇస్తున్నారు తెలుగు దర్శకులు. క్రాక్ సినిమా జయమ్మ పాత్రలో వరలక్ష్మీ నటన అందరినీ ఆకట్టుకుంది. దాంతో డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ఆఫర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు మరో పెద్ద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది. ఆ సినిమా మరేదో కాదు బాలకృష్ణ-గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూవీ నిర్మిస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం…

"ఆదిత్య 369 "సీక్వెల్ తో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనేది గత కొన్ని సంవత్సరాలుగా హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.ఇక మోక్షజ్ఞ సినిమాలు చేయడేమో అని ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌కి బాలకృష్ణ తన పుట్టినరోజున గుడ్ న్యూస్ చెప్పారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ అందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించి బాలకృష్ణ అభిమానులను సర్ ప్రైజ్ చేశారు.

తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "#NBK107 "మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

బాలకృష్ణకు చిరు, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్
మొత్తానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వచ్చేసింది. బాలకృష్ణ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక ఈ సందర్భగా బాలకృష్ణకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు అందరూ. ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. మరోవైపు తన సినిమాల అప్ డేట్లతో సోషల్ మీడియాలో నందమూరి హడావుడి మొదలైంది.

#NBK107 మూవీ అనౌన్స్ మెంట్
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ రోజు (జూన్ 10 ) తన 61 వ బర్త్ డే ను జరుపుకుంటున్నారు. హీరో బాలకృష్ణ కు అభిమానులతో పాటు సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్ సోషల్ మీడియా లో వెల్లు వెత్తుతున్నాయి. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. "అఖండ "మూవీ ముగింపు దశలో ఉంది. "అఖండ "మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

'అఖండ' బర్త్ డే పోస్టర్ రిలీజ్
‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మాసివ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఇక ఇది మూడో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ రోర్ పేరుతో విడుదలైన ‘ అఖండ’ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 16రోజుల్లోనే 50మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియన్స్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

అభిమానులకు 'బాలయ్య' రిక్వెస్ట్
జూన్ 10వ తేదీన నందమూరి బాలయ్య పుట్టిన రోజు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అభిమానులు ఈరోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కరోనా వల్ల గత ఏడాది తమ అభిమానులకు పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉండమని ఎలా చెబుతున్నారో.. ఈఏడాది కూడా అలాగే తమ అభిమానులను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా బాలకృష్ణ కూడా సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

ఎన్టీఆర్ పై బుక్ రాస్తా
విశ్వవిఖ్యాత ,నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ బయోపిక్ తీసిన సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ఈ బయోపిక్ ను తీశాడు బాలకృష్ణ. అయితే ఈ బయోపిక్ కు అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఇక ఇదిలా ఎన్టీఆర్ బయోపిక్ తీసిన బాలయ్య ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక బుక్ రాయాలనుకుంటున్నాడట. ఇక ఈవిషయాన్ని స్వయంగా బాలయ్యనే చెబుతున్నాడు. నేడు నందమూరి తారక రామారావు 98వ జయంతి.. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈనేపథ్యంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. .ఎన్టీఆర్ ఎప్పుడు మనతోనే ఉంటారని… తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు…

'ఎన్టీఆర్ జయంతి'కి బాలయ్య శ్రీరామ దండకం
మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ సర్పైజ్ ఇస్తానని నిన్న చెప్పిన సంగతి తెలిసిందే కదా. దీంతో ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు కాబట్టి దానినుండి ఏదైనా అప్ డేట్ రావచ్చేమో అని.. లేకపోతే గోపిచంద్ మలినేని తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆసినిమాకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఇవ్వొచ్చేమో అనుకున్నారు. అయితే ఈ సర్పైజ్ బాలయ్య సినిమాలకు సంబంధించిన సర్ప్రైజ్ కాదని అర్థమైంది. సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ తన గానంతో శ్రీరామదండకం విడుదల చేయనున్నారని తాజాగా ప్రకటించారు. స్వయంగా బాలకృష్ణ ఆలపించిన శ్రీరామదండకం ఈ నెల 28వ తేదీన ఉదయం 9:45 గంటలకు విడుదల కానుంది.

సర్పైజ్ కోసం చూడమంటున్న బాలయ్య
మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. దాాదాపు చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. ఈకరోనా లేకపోతే మరో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వాలి. ఇక ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నాడు.

'అఖండ' టీజర్ ట్రీట్ అప్పుడేనా..?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న రిలీజ్ కావాల్సింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

"అఖండ " లో శ్రీకాంత్ , పూర్ణ స్పెషల్ ఎట్రాక్షన్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న "అఖండ " మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “అఖండ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ
హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "అఖండ" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ , టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. "అఖండ "మూవీ తరువాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందే ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

‘అఖండ’ ట్రైలర్ ఆరోజు లేదు.. నిర్మాత క్లారిటీ
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ 'అఖండ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఈమధ్యనే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టగా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. అయితే రీసెంట్ గా ‘అఖండ’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా సంచలనాలు రేపుతుంది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ వీడియో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.