నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ రోజు (జూన్ 10 ) తన 61 వ బర్త్ డే ను జరుపుకుంటున్నారు. హీరో బాలకృష్ణ కు అభిమానులతో పాటు సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్ సోషల్ మీడియా లో వెల్లు వెత్తుతున్నాయి. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. “అఖండ “మూవీ ముగింపు దశలో ఉంది. “అఖండ “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా “అఖండ “మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా #NBK107 మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు గొపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో #NBK107 మూవీ తెరకెక్కనుంది. చిత్ర యూనిట్ వేట త్వరలో మొదలవుతుంది అంటూ బాలకృష్ణ థీమ్ పోస్టర్, టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: