నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కై నందమూరి అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షక , అభిమానులకు హాట్ టాపిక్ గా ఉంది. హీరో బాలకృష్ణ తన పుట్టినరోజున ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ బాలకృష్ణ అభిమానులను సర్ ప్రైజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా టైమ్ మిషన్ నేపథ్యంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ “ఆదిత్య 369 “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.” ఆదిత్య 369″ చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..తన తనయుడు మోక్షజ్ఞ ను “ఆదిత్య 369 ” మూవీ సీక్వెల్ ద్వారా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నామనీ , ఈ మూవీ కి “ఆదిత్య 999 మాక్స్”అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామనీ, ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామనీ , ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదనీ , “ఆదిత్య 999 మాక్స్” మూవీ కి తాను దర్శకత్వం వహించే అవకాశం కూడా ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































