సెట్ లో అడుగుపెట్టిన ‘అఖండ’

Nandamuri Balakrishna Joins The Sets Of Akhanda Movie Post Lockdown,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akhanda Movie Shoot,Akhanda Shooting Update,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,BB3​ Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Balakrishna Joins The Sets Of Akhanda,Final Schedule Of Akhanda Resumes,Akhanda Movie Final Schedule Resumes,Balakrishna New Poster From Akhanda,Akhanda Poster,Balakrishna New Poster,Balakrishna Resumes Shooting For Akhanda,Akhanda Shoot Resumes,Akhanda Movie Shoot Resumes,Balakrishna Akhanda Shoot Resumes,Akhanda Shoot,Pragya Jaiswal,Balakrishna Akhanda Shoot Resumes,Akhanda Movie Latest Shooting Update,Akhanda New Update,Akhanda Resumes Today,Akhanda Resumes Shooting Today,Balakrishna New Movie Update,#Akhanda,#BB3​

కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు వరుసగా సినిమాల షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు రెడీగా ఉన్న చిత్రాలను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈనేపథ్యంలో బాలకృష్ణ కూడా సెట్ లోకి అడుగుపెట్టాడు. ఈరోజు హైదరాబాదులో ఈ చిత్రం తుది షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. `అఖండ` షూటింగ్‌ రీ స్టార్ట్ చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఏకంగా సెట్‌లోని ఓ పోస్టర్‌ని పంచుకుంది యూనిట్‌. అఘోర లుక్‌లో బాలయ్య కనిపిస్తున్నాడు. హీరో బాలకృష్ణపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తి కానుంది. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేసి విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్‌ బస్టర్ విజయాల త‌ర్వాత‌ బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల మాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. మరి ఈసినిమాతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూద్దాం..

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =