మొత్తానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వచ్చేసింది. బాలకృష్ణ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక ఈ సందర్భగా బాలకృష్ణకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు అందరూ. ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. మరోవైపు తన సినిమాల అప్ డేట్లతో సోషల్ మీడియాలో నందమూరి హడావుడి మొదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే తన బాబాయ్ బర్త్ డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/fbR1nfmqn5
— Jr NTR (@tarak9999) June 10, 2021
ఇక చిరంజీవి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్ చేశారు. ‘మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.💐💐 #NBK
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2021
కాగా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా అఖండం. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఈసినిమా తరువాత గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడు బాలకృష్ణ.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈసినిమా తరువాత కొరటాలతో మరో సినిమా.. ఆతరువాత ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయనున్నాడు.మరోవైపు చిరు ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు.ఇంకా ఓ పది ఇరవై రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉండగా త్వరగా అది పూర్తి చేసి వీలైనంత వరకూ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: