శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ , మోహిని జంటగా టైమ్ మిషన్ నేపథ్యంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ “ఆదిత్య 369 “మూవీ 1991సంవత్సరం జూలై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో బాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. దర్శకుడు సింగీతం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “ఆదిత్య 369” మూవీ ని తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆదిత్య 369” మూవీ 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. “ఆదిత్య 369” సినిమా వల్ల వచ్చిన గౌరవం 30 ఏళ్ల తరువాతే కాదు యాభై ఏళ్లు అయినా ఉంటుందని అన్నారు. దర్శకుడు సింగీతం మాట్లాడుతూ.. తాను ఈ సందర్భంగా ఎస్పీ బాలు, బాలయ్య, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌లకు థ్యాంక్స్ చెప్పదలుచుకున్నానని అన్నారు. “ఆదిత్య 369” ఇండియాలోనే తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా అని అన్నారు. “ఆదిత్య 369” మూవీ సీక్వెల్ ను హీరో బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తన తనయుడు మోక్షజ్ఞ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: