‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మాసివ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఇక ఇది మూడో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ రోర్ పేరుతో విడుదలైన ‘ అఖండ’ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 16రోజుల్లోనే 50మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియన్స్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రేపు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో లో ఉన్న బాలయ్య పోస్టర్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది.
Wishing our #Akhanda, #NandamuriBalakrishna garu A very Happy Birthday. Here’s #AkhandaBirthdayRoar for you💥💥#HBDBalakrishna #HappyBirthdayBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @actorsrikanth @IamJagguBhai @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/QI9EKzYHuw
— Dwaraka Creations (@dwarakacreation) June 9, 2021
ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. కరోనా వల్ల మళ్లీ బ్రేక్ రాగా త్వరలోనే చిత్రీకరణ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక విడుదల తేదీని ప్రకటించనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.