అభిమానులకు ‘బాలయ్య’ రిక్వెస్ట్

Nandamuri Balakrishna Requests His Fans Not To Meet Him On His Birthday Keeping In View Of Corona Crisis,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Balakrishna,Nandamuri Balakrishna Latest News,Nandamuri Balakrishna New Movie News,Nandamuri Balakrishna Latest Film Updates,Nandamuri Balakrishna Next Project News,Nandamuri Balakrishna New Movie Details

జూన్ 10వ తేదీన నందమూరి బాలయ్య పుట్టిన రోజు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అభిమానులు ఈరోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కరోనా వల్ల గత ఏడాది తమ అభిమానులకు పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉండమని ఎలా చెబుతున్నారో.. ఈఏడాది కూడా అలాగే తమ అభిమానులను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా బాలకృష్ణ కూడా సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నా ప్రాణ సమానులైన అభిమానులకు” అంటూ “ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బయటికి రావడం అభిలషణీయం కాదు. మీ అభిమానమే నన్ను ఇంతటివాడ్ని చేసింది… ఒక్క అభిమాని దూరమైనా భరించలేను. మీ అభిమానంతో సాటిరాగల ఆశీస్సు లేదు, మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపడమే నా జన్మదిన వేడుకగా భావిస్తాను. దయచేసి ఎవరూ రావొద్దు” అని బాలయ్య స్వీట్ రిక్వెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా తరువాత బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈనేపథ్యంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమాల నుండి అప్ డేట్లు వస్తాయని చూస్తున్నారు అభిమానులు. వీటితో మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈరోజు ఎన్ని అప్ డేట్స్ వస్తాయో..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here