
ట్యాగ్ · 284 కథనాలు · పేజీ 12


రెండు మూవీస్ కు కృతిశెట్టి గ్రీన్ సిగ్నల్

హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య

"లవ్ స్టోరీ "రిలీజ్ డేట్ ఫిక్స్ ?

‘లాల్ సింగ్ చద్దా’ సెట్స్‌లో ఆమిర్ తో చైతు

లడఖ్ లో నాగచైతన్య

నైట్ కర్ఫ్యూ తీసినప్పుడే 'లవ్ స్టోరీ' రిలీజ్

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి

'థ్యాంక్యూ' కోసం 18 గంటలు పనిచేశాం

"ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ పై నాగచైతన్య స్పందన

"బంగార్రాజు " లో జంటగా సమంత , నాగచైతన్య ?

మూడు సినిమాలతో నాగచైతన్య సందడి

‘థాంక్యూ’ ఇటలీ షెడ్యూల్ పూర్తి

కార్గిల్ కు నాగచైతన్య

సింక్ సౌండ్ టెక్నాలజీ తో "థ్యాంక్ యు"

ఇటలీలో నాగచైతన్య

"లవ్ స్టోరీ" విడుదల వాయిదా

నాగచైతన్య తో మరోసారి జోడీగా రాశీఖన్నా

'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ పూర్తి చేసుకున్న చైతు
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాలపై కూడా ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి పాత్ర దక్కితే అక్కడ కూడా సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా నాగచైతన్య కూడా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. నాగ చైతన్య ప్రస్తుతం హిందీ లో అమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీ లో ఓ ప్రత్యేక రోల్ లో నటిస్తున్న సంగతి విదితమే. ఈ మూవీలో ఆర్మీ జవాన్ గా.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చైతన్య ఆమీర్ ఖాన్ స్నేహితుడిగా కనిపిస్తాడన్న వార్తలు అయితే ఇప్పటికే చాాలా వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్న తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి…

రెండు మూవీస్ కు కృతిశెట్టి గ్రీన్ సిగ్నల్
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో కృతి శెట్టిటాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కృతిశెట్టి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్”, సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ , రామ్ పోతినేని”#RAPO 19 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ‘శ్యామ్ సింగరాయ్” మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “థ్యాంక్ యు ” మూవీ లో హీరో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా “లో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. హీరో నాగచైతన్య ప్రస్తుతం “లాల్ సింగ్ చద్దా “ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

"లవ్ స్టోరీ "రిలీజ్ డేట్ ఫిక్స్ ?
ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” రూపొందింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘లాల్ సింగ్ చద్దా’ సెట్స్‌లో ఆమిర్ తో చైతు
ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఓటీటీ నుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దీనితోపాటు `థ్యాంక్యూ` పేరుతో విక్రమ్ కె. కుమార్ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.

లడఖ్ లో నాగచైతన్య
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “థ్యాంక్ యు ” మూవీ లో హీరో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే.

నైట్ కర్ఫ్యూ తీసినప్పుడే 'లవ్ స్టోరీ' రిలీజ్
సినిమా రిలీజ్ లు సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం షూటింగ్ లకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోలు షూటింగ్ లు స్టార్ చేసేశారు కూడా. అయితే థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడానికి మాత్రం టైమ్ పడుతుంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకఇదిలా ఉండగా థియేటర్లు తెరిచినా తమ సినిమాను అప్పుడే రిలీజ్ చేయమని చెబుతున్నారు లవ్ స్టోరీ మేకర్స్

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి
మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. కరోనా పరిస్థితుల్లో కూడా ఇటలీ షెడ్యూల్ ను చాలా కష్టపడి ముగించుకొని వచ్చారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో మళ్లీ షూటింగ్ లకు ప్లాన్ చేస్తున్నారు అందరూ. ఈనేపథ్యంలోనే ఈసినిమా షూటింగ్ ను తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టు తెలుపుతున్నాడు విక్రమ్.

'థ్యాంక్యూ' కోసం 18 గంటలు పనిచేశాం
గత ఏడాది కరోనా వల్ల సినీ పరిశ్రమకు పెద్ద నష్టమే జరిగింది. కనీసం ఈఏడాది అయినా కోలుకుంటుంది కదా అనుకుంటుండగానే మళ్లీ సెకండ్ వేవ్ వచ్చి పెద్ద దెబ్బ కొట్టింది. ఈఏడాది జనవరి నుండి కాస్త అన్ని సినిమాల రిలీజ్ లు, షూటింగ్ లు మొదలయ్యాయి. మళ్లీ మూడునెలలకు బ్రేక్ పడింది. అప్పటికీ కాస్త ధైర్యం చేసి పలువురు షూటింగ్ లు ఆపకుండా చేసినా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో యూనిట్ లోనే చాలా మందికి కరోనా రావడంతో ఆపేయడం జరిగింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా కష్టపడి పనిచేశామంటుంది రాశీఖన్నా. అది కూడా ఇక్కడ కాదు ఇటలీలో.

"ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ పై నాగచైతన్య స్పందన
D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సమంత ప్రధాన పాత్రలలో తీవ్రవాదం – సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో సమంత ఫస్ట్ టైమ్ టెర్రరిస్ట్ పాత్రలో సూసైడ్ బాంబర్ గా కనిపించారు. డీగ్లామర్ లుక్, యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా పాల్గొన్న సమంత నెగిటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

"బంగార్రాజు " లో జంటగా సమంత , నాగచైతన్య ?
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి కథానాయికలు. “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు “సోగ్గాడే చిన్నినాయనా “మూవీకి సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ రూపొందనుంది.

మూడు సినిమాలతో నాగచైతన్య సందడి
2021 సంవత్సరం లో హీరో నాగచైతన్య మూడు సినిమాలతో సందడి చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "థ్యాంక్ యు " మూవీ లో నటిస్తున్నారు. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా ఇటలీ లో జరిగిన విషయం తెలిసిందే.

‘థాంక్యూ’ ఇటలీ షెడ్యూల్ పూర్తి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'లవ్ స్టోరీ'. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు.

కార్గిల్ కు నాగచైతన్య
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ , వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ జంటగా బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ "ఫారెస్ట్ గంప్ " ఆధారంగా "లాల్ సింగ్ చద్దా "హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "లాల్ సింగ్ చద్దా" మూవీ తో హీరో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

సింక్ సౌండ్ టెక్నాలజీ తో "థ్యాంక్ యు"
నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “థ్యాంక్ యు “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ఇటలీలో నాగచైతన్య
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "మనం "మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా "థ్యాంక్ యు "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. డిసెంబర్ 21 వ తేదీ "థ్యాంక్ యు "మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

"లవ్ స్టోరీ" విడుదల వాయిదా
అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కావాల్సిఉంది . “లవ్ స్టోరీ “మూవీ లో దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

తెలుగు , కన్నడ , మలయాళ భాషలలో "లవ్ స్టోరీ "రిలీజ్
ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ లో దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

నాగచైతన్య తో మరోసారి జోడీగా రాశీఖన్నా
నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన "లవ్ స్టోరీ " మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక. హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "మనం "మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "థ్యాంక్ యు " మూవీ లో నటిస్తున్నారు. హీరో నాగచైతన్య కు జోడీగా అందాల రాశీఖన్నా ఎంపిక అయ్యారు.

లవ్ స్టోరీ 'ఏవో ఏవో కలలే' సాంగ్ రిలీజ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో పాట రిలీజ్ అయింది.