D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సమంత ప్రధాన పాత్రలలో తీవ్రవాదం – సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో సమంత ఫస్ట్ టైమ్ టెర్రరిస్ట్ పాత్రలో సూసైడ్ బాంబర్ గా కనిపించారు. డీగ్లామర్ లుక్, యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా పాల్గొన్న సమంత నెగిటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఫ్యామిలీ మ్యాన్ 2” ట్రైలర్ వీక్షించిన హీరో నాగచైతన్య , సమంత పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. నెగిటివ్ రోల్ లో, ఒక కొత్త అవతారంలో కనిపించిన సమంత పెర్ఫార్మెన్స్ కు పది కి పది మార్కులు ఇస్తూ లవ్ ఇట్ 10/10 అంటూ నాగచైతన్య ట్వీట్ చేశారు.నాగచైతన్య ప్రస్తుతం “థ్యాంక్ యు “, “లాల్ సింగ్ చద్దా ” బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: