ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఓటీటీ నుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దీనితోపాటు `థ్యాంక్యూ` పేరుతో విక్రమ్ కె. కుమార్ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు నాగచైతన్య కూడా బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో చైతు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే చైతుఈ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సింది కానీ.. కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇక ఇప్పుడు ఫైనల్ గా ‘లాల్ సింగ్ చద్దా’ సెట్స్‌లో అడుగు పెట్టాడు చైతు. అంతే కాదు.. సెట్స్ నుంచి ఆమిర్‌తో అతను ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్టర్ లోమ్యాన్లీగా ఉన్న చైతు లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
Grateful #Bala #LaalSinghChaddha pic.twitter.com/hLidCDCcyf
— chaitanya akkineni (@chay_akkineni) July 9, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: