శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య–సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాతో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజులుగా ఈసినిమా ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక అక్కడ కూడా చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ జరుపుకున్నారు. తాజాగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ‘థ్యాంక్యూ’ టీమ్ ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.. ఇంటికి తిరిగి వస్తున్నాము అంటూ ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న పీసీ శ్రీరామ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
#Thankyouthemovie
Schedule rap.
Returning home .@chay_akkineni @Vikram_K_Kumar @MusicThaman @RaashiiKhanna_ #Dillraju pic.twitter.com/hy5kDwrMzw— pcsreeramISC (@pcsreeram) May 7, 2021
కాగా ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ‘మనం’ వంటి క్లాసిక్ తెరకెక్కించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మరోసారి నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మరో హిట్ కొడతారేమో చూద్దాం..
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: