టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాలపై కూడా ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి పాత్ర దక్కితే అక్కడ కూడా సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా నాగచైతన్య కూడా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. నాగ చైతన్య ప్రస్తుతం హిందీ లో అమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీ లో ఓ ప్రత్యేక రోల్ లో నటిస్తున్న సంగతి విదితమే. ఈ మూవీలో ఆర్మీ జవాన్ గా.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చైతన్య ఆమీర్ ఖాన్ స్నేహితుడిగా కనిపిస్తాడన్న వార్తలు అయితే ఇప్పటికే చాాలా వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్న తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసందర్భంగా చిత్రయూనిట్ చైతుకు గ్రాండ్ గా ఫేర్ వెల్ పార్టీ కూడా ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
YuvaSamrat @chay_akkineni #NagaChaitanya wrapped up his shoot for #AamirKhan‘s #LaalSinghChaddha pic.twitter.com/M2xnq4tzx8
— BARaju’s Team (@baraju_SuperHit) August 10, 2021
ఇక తెలుగులో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు చైతు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్. ఇక దీనితో పాటు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే బంగార్రాజు సినిమాలో కూడా నాగార్జునతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: