గత ఏడాది కరోనా వల్ల సినీ పరిశ్రమకు పెద్ద నష్టమే జరిగింది. కనీసం ఈఏడాది అయినా కోలుకుంటుంది కదా అనుకుంటుండగానే మళ్లీ సెకండ్ వేవ్ వచ్చి పెద్ద దెబ్బ కొట్టింది. ఈఏడాది జనవరి నుండి కాస్త అన్ని సినిమాల రిలీజ్ లు, షూటింగ్ లు మొదలయ్యాయి. మళ్లీ మూడునెలలకు బ్రేక్ పడింది. అప్పటికీ కాస్త ధైర్యం చేసి పలువురు షూటింగ్ లు ఆపకుండా చేసినా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో యూనిట్ లోనే చాలా మందికి కరోనా రావడంతో ఆపేయడం జరిగింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా కష్టపడి పనిచేశామంటుంది రాశీఖన్నా. అది కూడా ఇక్కడ కాదు ఇటలీలో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’.ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా కరోనా టైమ్ లో కూడా ఇటలీలో షూటింగ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వచ్చింది. ఇక ఈ అనుభవం గురించి రాశీఖన్నామాట్లాడుతూ.. ఇండియా నుంచి ఇటలీకి వెళ్లాలంటే భయమేసింది కానీ, సినిమా కంప్లీట్ చేయాలి కాబట్టి భయంతోనే ఇటలీకి వెళ్లాలని చెప్పింది. భయం భయంగానే షూటింగ్ పూర్తి చేశామని తెలిపింది. షూటింగ్ త్వరగా ముగించేందుకు రోజుకు 18 గంటలు కష్టపడ్డాం.. కొంచెం కష్టమైనా.. మొత్తనాకి షూటింగ్ పూర్తి చేసుకొని రావడం సంతోషంగా ఉందని తెలిపింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో మహేశ్‌బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: