కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Latest News

ట్యాగ్ · 168 కథనాలు · పేజీ 8

సినిమా వార్తలు

మహేష్ బాబు అభిమానులకు శుభవార్త

బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ తో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్నమల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం"మూవీ 2021సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తరువాత తన దర్శకత్వంలో రూపొందే మూవీ ని రాజమౌళి అనౌన్స్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో మహేష్ బాబు?

‘రాజకుమారుడు’(1999), ‘యువరాజు’(2000), ‘వంశీ’(2000), ‘మురారి’(2001), ‘బాబీ’(2002).. ఇలా కెరీర్ ఆరంభంలో వరుస ప్రేమకథా చిత్రాలతో పలకరించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తరువాత విభిన్న కథా చిత్రాల వైపు దృష్టి సారించాడు. కాగా, సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నాడ‌ట మహేష్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలంగాణ పోలీసులకు మహేష్ థ్యాంక్స్..!

కరోనా వైరస్ ను అరికట్టేందుకు గాను దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించి అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదో నిత్యావసర వస్తువులు.. ఎమర్జెన్సీ అయితేనే కానీ బయటకు పంపించని పరిస్థితి. ఇక ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు స్వతహాగా గృహ నిర్బంధంలో వుంటున్నారు. ఇక ఈ కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకోసం పోరాడుతున్న వారు ఎవరైనా వున్నారంటే వాళ్ళు డాక్టర్స్, నర్సులు, పోలీసులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకపక్క వైద్యులు వైరస్ బాధితులను కాపాడటానికి చికిత్స చేస్తుంటే మరోపక్క పోలీసులు ప్రజలు బయట తిరగకుండా... ఎవరికీ వైరస్ అంటకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నారు. వారి చేస్తున్న ఈ సేవలకు మనం…

TFN Adminవాట్సాప్
Don't Trust Fake News About Corona Virus Says Super Star Mahesh Babu
సినిమా వార్తలు

ఫేక్ న్యూస్ పట్టించుకోవద్దు - మహేష్ బాబు

కరోనా మహమ్మారి కారణం గా ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఈ రోజు "వరల్డ్ హెల్త్ డే " సందర్భంగా మహేష్ బాబు తన ట్వీట్స్ ద్వారా ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. 2వారాల లాక్ డౌన్ కారణం గా మనం స్ట్రాంగ్ గా తయారయ్యామని, కరోనా వైరస్ నివారణకై మన ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిద్దాం అని, COVID-19 నివారణకు ముందుండి పోరాటం చేస్తున్న వారికి "వరల్డ్ హెల్త్ డే " సందర్భంగా థ్యాంక్స్ చెబుదామని, మన హెల్త్ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి వీధులలో, హాస్పటల్స్ లో పోరాడే ధైర్యస్థులకు ప్రశంసలు తెలపాలని ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు దీపపు వెలుగులో మహేష్ బాబు

వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా క్రైసిస్ చారిటీ కి తన వంతు సాయం అందించిన మహేష్ బాబు ప్రధాని మోదీ పిలుపుకు స్పందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి క్రేజీ కాంబోలో మూవీ..!

మహేష్ - త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అభిమానులు ఎదురుచూసే క్రేజీ కాంబినేషన్స్ లో వీరి కాంబినేషన్ కూడా ఉంటుంది. గురూజీ పంచ్ డైలాగ్స్.. మహేష్ నోటి నుండి వస్తే ఆ డైలాగ్స్ ఎలా పేలతాయో చెప్పనక్కర్లేదు. అతడు.. ఆ తర్వాత వచ్చిన ఖలేజా సినిమాలో చూశాం. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. దానికి వేరే కారణాలు కూడా చెపుతున్నారు. వీరిద్దరి మ‌ధ్య వ‌చ్చిన కొన్ని విభేదాల వ‌ల‌న ఒక‌రికొక‌రు దూరంగా ఉంటున్నార‌ని ఇండ‌స్ట్రీ టాక్. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రీ యూనియన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రిలాక్సింగ్ మూడ్ లో మహేష్ బాబు

మనకున్న మూవీ సూపర్ స్టార్స్ లో కూలెస్ట్ పర్సన్ మహేష్ బాబు అని చెప్పడంలో సందేహం లేదు. మామూలుగానే కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. రిలాక్స్ మూడ్ లో పైజామా ధరించి సోఫా లో కూర్చుని చిరు నవ్వులు చిందిస్తున్న మహేష్ బాబు ఫోటో ను ఆయన సతీమణి నమ్రత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా

'తేనె మనసులు' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి... సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకున్నారు కృష్ణ. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సూప‌ర్ స్టార్ కృష్ణ‌, రామ్మోహ‌న్, సంధ్యారాణి, సుక‌న్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 1965 మార్చి 31న విడుద‌లై ఘన విజ‌యం సాధించింది. ఈ నేపథ్యంలో నేటితో ఈ సినిమా 55 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంది. అంతేకాదు ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. ఫస్ట్ 70 ఎమ్ఎమ్, ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్, ఫస్ట్ కౌబాయ్ ఇలా అన్నింటి సూపర్ స్టార్ పేరే ఉంటుంది. మొదటి కౌబాయ్, మొదటి జేమ్స్ బాండ్ సినిమా ఇలా ఏ కొత్త ప్రయోగం చేయాలన్నా సూపర్ స్టార్ కృష్ణ తర్వాతే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

GMB ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెబ్ సిరీస్?

టాలీవుడ్ లో సక్సెసఫుల్ హీరో గా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ బ్యానరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ భాగస్వామ్యంలో రూపొందిన శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు మూవీస్ ఘనవిజయం సాధించాయి. జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా "మేజర్ "మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ఎఫ్ 3` సెకండాఫ్ లో మ‌హేష్ సంద‌డి?

గ‌త ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ `ఎఫ్ 2`... ఏ స్థాయిలో పెర్ ఫార్మ్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి... త్వ‌ర‌లో సీక్వెల్ రానుంది. దాదాపుగా`ఎఫ్ 2`లో న‌టించిన వాళ్ళంద‌రూ... `ఎఫ్ 3`లోనూ కొన‌సాగే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ద్విపాత్రాభినయంలో మహేష్..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ప్రధాన పాత్రలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని... రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్ తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Sets New Record,latest telugu movies news, Mahesh Babu Latest Movie Details, Mahesh Babu latest news, Mahesh Babu Next Film Updates, Mahesh Babu Upcoming Movie News, Sarileru Neekevvaru Movie Record, Superstar Mahesh Babu, Telugu
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ను త్రోసిరాజని రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

`మ‌హేష్ బాబు 27`కి రిలీజ్ డేట్ ఫిక్స‌యిందా?

`భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. కాగా, త‌న త‌దుప‌రి చిత్రాన్ని `మ‌హ‌ర్షి` ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లితో చేయ‌బోతున్నాడు మ‌హేష్. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వేస‌విలో పట్టాలెక్క‌నుంది. ప్ర‌ముఖ నిర్మాత `దిల్` రాజు ఈ సినిమాని నిర్మిస్తార‌ని టాక్. అలాగే `భ‌ర‌త్ అనే నేను` త‌రువాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మ‌రోమారు మ‌హేష్ తో జ‌ట్టుక‌ట్ట‌బోతోంద‌ని వినికిడి. థ‌మ‌న్ స్వ‌రాలు అందించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
Mahesh Babu Greets Soldiers On Republic Day
సినిమా వార్తలు

సైనికులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మిలటరీ అధికారి గా నటించిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సైనికులతో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
Mahesh Babu Becomes The Real Super Star Of Tollywood
సినిమా వార్తలు

"రియల్ సూపర్ స్టార్ "

బాలనటుడు గా టాలీవుడ్ లో ప్రవేశించిన మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ "రాజకుమారుడు" తో హీరోగా మారారు. మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగారు.

Team TFNవాట్సాప్
Mahesh Babu Upcoming Movie To Have Two Heroines
సినిమా వార్తలు

ఇద్ద‌రు నాయిక‌ల‌తో మ‌హేష్ బాబు చిత్రం?

క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం `రాజ‌కుమారుడు` మొద‌లుకుని గ‌త చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` వ‌ర‌కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన సినిమాల‌న్నింటిని ప‌రిశీలిస్తే ఓ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అదేమిటంటే... `యువ‌రాజు`, `ట‌క్క‌రిదొంగ‌`, `బ్ర‌హ్మోత్స‌వం` మిన‌హాయిస్తే దాదాపు మ‌హేష్ హీరోగా న‌టించిన సినిమాల‌న్నీ `ఏక క‌థానాయిక` చిత్రాలే.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Mahesh Babu Banks On This Lucky Date For His Movie Success, Mahesh Babu Latest News, Mahesh Babu New Movie News, Superstar Mahesh Babu Upcoming Film News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates
సినిమా వార్తలు

మ‌హేష్‌ బాబు... సేమ్ డేట్ - సేమ్ ఫీట్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు... సేమ్ డేట్ కి సేమ్ ఫీట్ ని రిపీట్ చేశాడు. కెరీర్ లో రెండోసారి `హ్యాట్రిక్` విజ‌యాలు సొంతం చేసుకున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా భారీ అంచనాల మధ్య శనివారం విడుదలైంది. ఇక ముందుగా ఊహించినట్లుగానే తొలిరోజే హిట్ టాక్ నే తెచ్చుకుంది. ఇక తొలి రోజు వసూళ్ల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ దుమ్ముదులిపేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో కలిపి తొలిరోజు ఈ సినిమా 35 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

TFN Adminవాట్సాప్
Superstar Mahesh Babu Has Hit A Blockbuster On A Special Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Mahesh Babu Latest News,Mahesh Babu New Movie News,Mahesh Babu Next Film Updates,Mahesh Babu New Mov
సినిమా వార్తలు

అప్పుడు కృష్ణ - ఇప్పుడు మహేష్..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Mahesh Babu Confirms His Next With Vamshi Paidipally, Mahesh Babu Latest Movie Details, Mahesh Babu Latest News, Mahesh Babu New Movie Updates, Mahesh Babu Next Project News, Mahesh Babu Pours His Heart Out, Mahesh Babu To
సినిమా వార్తలు

'మహర్షి' డైరెక్టర్ తోనే తర్వాత సినిమా

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలివుంది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి. దీనితో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్, ట్రయిలర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంకా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి…

TFN Adminవాట్సాప్

షేర్