ట్యాగ్ · 168 కథనాలు · పేజీ 7
మరోసారి 'రియల్ హీరో' అనిపించుకున్న మహేష్..!
హీరో కృష్ణ కు మహేష్ బాబు ఫాదర్స్ డే శుభాకాంక్షలు

OFFICIAL..పరుశురాంతోనే మహేష్ సినిమా
ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మహేష్

త్వరలో SSMB 27 మూవీ అనౌన్స్ మెంట్
'మాస్క్ ఇండియా' అంటున్న మహేష్..!
మహేష్-గౌతమ్ ల హైట్ చెక్..!
మాస్క్ ధరించడం తప్పనిసరి..!

మహేష్ బాబు పర్సనల్ జిమ్
మీరే మా నిజమైన 'సూపర్ హీరోస్'..!
స్పై థ్రిల్లర్ మూవీ లో మహేష్ బాబు ?

మహేష్ కోసం కథ రాసే పనిలో విజయేంద్ర ప్రసాద్...!
మహేష్ - సితార స్విమ్మింగ్ పోటీ..!
లాక్ డౌన్ లో ఎంతమంది సెలబ్రిటీస్ తమ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారో తెలియదు కానీ... సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ టైమ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మామూలుగానే మహేష్ బాబు కాస్త తీరిక సమయం దొరికినా ఫ్యామిలీతోనే ఎక్కున ఉండటానికి ఇష్టపడతాడు. అలాంటిది ఈ లాక్ డౌన్ వల్ల కావాల్సినంత టైం దొరికింది. దీనితో పిల్లలు సితార, గౌతమ్ తో కలిసి ఆడుతూ, పాడుతా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలను, వీడియోలను నమ్రత ఎప్పుటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వుంది. మొన్ననే ప్రిన్స్, సితార కలిసి ‘టంగ్ – ట్విస్టర్’ గేమ్ ఆడారు. ‘ఓడిపోయావ్’ అంటూ తండ్రితో సితార అల్లరి చేయటం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు…
మరోసారి 'రియల్ హీరో' అనిపించుకున్న మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే సాయం గురించి ఎవరితో చెప్పుకోరు అన్న సంగతి తెలిసిందే. ఎంతో మందికి తాను సాయం చేశాడు. కానీ ఏరోజు తాను చేసిన సాయం గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అది మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో సామజిక సేవల్లో పాల్గొంటూనే ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తుంటారు.. చిన్న పిల్లలకు ఎలాంటి విపత్తు వచ్చినా తనవంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు...
లేడీ అమితాబ్ విజయశాంతి కి మహేష్ బర్త్ డే శుభాకాంక్షలు
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయ శాంతి ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. అత్యధిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి విజయ శాంతి రికార్డ్ క్రియేట్ చేశారు . 3 దశాబ్దాల సినీ కెరీర్ లో 180 మూవీస్ కు పైగా నటించి, ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ హోదాను విజయశాంతి దక్కించుకున్నారు. హీరోలతో పోటీపడి రెమ్యునరేషన్ అందుకున్న విజయశాంతి "నాయుడమ్మ "మూవీ (2006 ) తరువాత సినిమాలకు దూరం అయ్యారు.
హీరో కృష్ణ కు మహేష్ బాబు ఫాదర్స్ డే శుభాకాంక్షలు
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫాదర్ హీరో కృష్ణ కు ఫాదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ తరువాత మహేష్ బాబు , సూపర్ హిట్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
'సర్కారు వారి పాట' ఖాతాలో మొదటి రికార్డ్
అలా వచ్చాడో లేదో ఇలా అప్పుడే రికార్డులు క్రియేట్ చేసే పనిలో పడ్డాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. నిన్న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ సినిమా టైటిల్ ను, ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రాక రాక తమ హీరో సినిమా అప్ డేట్ వచ్చింది..మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారా. ‘సర్కారు వారి పాట’లో లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ ప్లస్ మాస్ లుక్ లో వుండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ లుక్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో సోషల్ లైక్ లు, షేర్ లతో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అంతేకాదు మరో రికార్డు ను కూడా సొంతం చేసుకుంది. 24 గంటల్లో మోస్ట్ రీట్వీట్ చేసిన ప్రీ లుక్ ఇదే, అలాగే మోస్ట్ లైక్స్…
గొప్ప నటుడిగా.. మంచి తండ్రిగా.. గొప్ప భర్తగా గుర్తుపెట్టుకోవాలని నా కోరిక..!
ఇన్ని రోజులు తమ హీరో సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు మహేష్ తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. తన తర్వాత పరుశురాం దర్శకత్వంలో ఉండబోతుందని చెప్పిన చిత్రయూనిట్... నిన్న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నిన్న మహేష్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. మరి…

OFFICIAL..పరుశురాంతోనే మహేష్ సినిమా
ఒకదాని తర్వాత ఒకటి మహేష్ బాబు ఫ్యాన్స్ కు సర్పరైజ్ ఇస్తున్నారు. రేపు ఆయన తన అభిమానులతో ముచ్చటించనున్నట్టు ఇప్పటికే తెలిపారు. రేపు సూపర్ కృష్ణ పుట్టినరోజు కావడంతో మహేష్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ లో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం మొదలుకానుంది.
ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మహేష్
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో గడుపుతున్నాడు. మామూలుగానే సినిమా షూటింగ్ల సమయంలో ఏ కాస్త విరామం దొరికినా తన ఫ్యామిలీకే కేటాయిస్తుంటాడు. ఇక ప్రస్తుత లాక్డౌన్ సమయంలో తన పిల్లలతో కలిసి చేసే అల్లరి పనులను ఎప్పటికప్పుడు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తునే ఉన్నారు. ఇక మహేష్ బాబు తన పిల్లలతో చేసే అల్లరి.. తనలో ఉన్న మరో యాంగిల్ ను చూసి అభిమానులు ఇప్పటికే ముచ్చటపడిపోతున్నారు.

త్వరలో SSMB 27 మూవీ అనౌన్స్ మెంట్
వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా టాలీవుడ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ తరువాత తాను నటించే మూవీ ను త్వరలో అనౌన్స్ చేయనున్నారు. సూపర్ హిట్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో SSMB 27 మూవీ రూపొందనుంది.
'మాస్క్ ఇండియా' అంటున్న మహేష్..!
కరోనా మహమ్మారి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది . ఈ కరోనా వైరస్ వలన చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలతో పోరాడుతున్నారు.ప్రస్తుతం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు చేసారు కానీ దీనివల్ల కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మనకి మనమే జాగ్రత్తలు తీసుకోవాలని.. బయటకు వెళ్తే మాస్క్ లు తప్పనిసరి అని శానిటైజర్లు కూడా ముఖ్యమని ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇదే అంశంపైన సెలబ్రిటీలు కూడా తమ వంతు భాధ్యతగా కరోనా పై జాగ్రత్తలు చెబుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

డిస్కవరీ ఛానల్ కు ప్రకాశ్ రాజ్ గాత్ర దానం..ఎదురుచూస్తుంటాం అన్న మహేష్
డిస్కవరీ ఛానల్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అద్భుతమైన సన్నివేశాల్ని అరుదైన సన్నివేశాలను.. చూపించడం ఈ ఛానల్ స్పెషాలిటీ. అందుకే ఈ ఛానల్ కు చాలా మంది ఫెవెరెట్స్ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజులు జాతీయ బాషలకే పరిమితమవ్వగా ఇప్పుడు ప్రాంతీయ ప్రజలకు కూడా దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే సరికొత్త ప్లాన్ తో వచ్చింది డిస్కవరీ ఛానల్. అనేక భాషల్లో తన వీక్షకులను పెంచుకునేందుకు రోజు రోజుకు మరింత ప్రయత్నాలు చేస్తుంది.
మహేష్-గౌతమ్ ల హైట్ చెక్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటాడు.తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు మహేష్. అలాంటిది ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో గత రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటూ సితార, గౌతమ్ లతో కలిసి ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
మాస్క్ ధరించడం తప్పనిసరి..!
లాక్ డౌన్ నాలుగోసారి కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో లాగ కాకుండా కొన్ని సడలింపులు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. షూటింగ్స్ కు కూడా కొన్నిషరతులతో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఇప్పటికే అనుమతులు ఇచ్చారు.

మహేష్ బాబు పర్సనల్ జిమ్
"భరత్ అనే నేను", "మహర్షి ", "సరిలేరు నీకెవ్వరు " వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని తన ఇంటిలో మహేష్ బాబు పర్సనల్ జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ తన జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తారు.
సితార కోసం మహేష్ పాట..!
లాక్ డౌన్ లో మహేష్ బాబు తన అభిమానులకు సూపర్ ఫన్ ఇస్తున్నారు. మహేష్ బాబు,సితార ల వీడియో లు రోజుకొకటి విడుదల చేస్తూ అభిమానులకు మహేష్ లో ఉన్న మరో యాంగిల్ ను చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోగా... తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల తనయ సితారతో చిన్నపిల్లాడిలా మారిపోయి డెడ్డీ బెర్రీతో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది నమ్రత. ఇక ఈ వీడియోతో పాటు నమ్రత మెసేజ్ పోస్టు చేస్తూ… ‘ప్రేమ, జీవితం మరియు నవ్వు.. మహేష్ – సితు పాప మధ్య చిన్న టెడ్డీ కచేరీ. ఇక సితార మాత్రమే మహేష్ లో ఉన్న చిన్నపిల్లాడిని బయటకు తీసుకురాగలదు’అని పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో లో మహేష్ సీతారాతో ఆడటమే…
మహేష్, రాజమౌళి సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జక్కన్న మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ అయ్యాక సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని టాలీవుడ్ టాక్.
మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళులర్పిన్నా..!
కరోనా వల్ల రాత్రింబవళ్లు ఎలాంటి అలుపు లేకుండా మన కోసం పనిచేస్తున్న డాక్టర్స్, పోలీసులు, నర్సులు మరియు పారిశుధ్య కార్మికులను ఉద్దేశించి ఇటీవలే వారికి కృతజ్ఞతలు తెలుపుతూ... టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి.. మనదేశ సైనికులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.
మీరే మా నిజమైన 'సూపర్ హీరోస్'..!
కరోనాతో పోరాడుతున్న మన కోసం... రాత్రింబవళ్లు ఎలాంటి అలుపు లేకుండా మన కోసం పనిచేస్తున్నారు డాక్టర్స్, పోలీసులు, నర్సులు మరియు పారిశుధ్య కార్మికులు. ఇక ఇప్పటికే వారి చేసే సేవలకు గాను అందరు వారి కృతజ్ఞతలు తెలుపుతుండగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడాదీనిపై స్పందించారు. ఈ కష్ట కాలంలో వారిపై ప్రేమ, సానుభూతి చూపించడమే వారికి మనం ఇచ్చే గొప్ప బహుమతి. ఈ పోరాటవీరుల పట్ల మర్యాదపూర్వకంగా, దయతో మెలగాలని అందరినీ అభ్యర్థిస్తున్నా. వారికి గౌరవం ఇవ్వండి. అవిరామంగా పనిచేస్తున్న వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంటివద్దనే ఉంటూ సురక్షితంగా ఉండండి’అంటూ మహేశ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే…
స్పై థ్రిల్లర్ మూవీ లో మహేష్ బాబు ?
బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను" , "మహర్షి " , "సరిలేరు నీకెవ్వరు" వంటి మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు తన తరువాత మూవీ దర్శకుడు పరశురామ్ తో చేయనున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒక మూవీ ని అనౌన్స్ చేశారు. ఈ మూవీ స్పై థ్రిల్లర్ గా రూపొందనుందని, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని సమాచారం.

మహేష్ కోసం కథ రాసే పనిలో విజయేంద్ర ప్రసాద్...!
ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు తర్వాత సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మొదట వంశీ పైడిపల్లి తో సినిమా అన్నారు కానీ ఆ తర్వాత పరుశురాం పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు మే 31 న ఈ సినిమా లాంచింగ్ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.