పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో మహేష్ బాబు?

Super Star Mahesh Babu To Come Up With A Full Length Love Story After Bobby

‘రాజకుమారుడు’(1999), ‘యువరాజు’(2000), ‘వంశీ’(2000), ‘మురారి’(2001), ‘బాబీ’(2002).. ఇలా కెరీర్ ఆరంభంలో వరుస ప్రేమకథా చిత్రాలతో పలకరించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తరువాత విభిన్న కథా చిత్రాల వైపు దృష్టి సారించాడు. కాగా, సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నాడ‌ట మహేష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ డైరెక్షన్‌లో మహేష్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘మహేష్ 27’గా రూపొందనున్న ఈ చిత్రం మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందట. అలాగే, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్, కామెడీ వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌కి కూడా స్కోప్ ఉంటుంద‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జి.మ‌హేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, కొర‌టాల శివ హోమ్ ప్రొడ‌క్ష‌న్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అలాగే, 2021 వేసవికి ‘మహేష్ 27’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 16 =