అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి అంతా పాజిటివ్ టాకే వస్తుంది. ఈ సంక్రాంతికి మహేష్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టడం ఖాయమని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.. !
[custom_ad]
ఇక ఈ నేపథ్యంలో అందరూ ఒక విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. 1985 జనవరి 11వ తేదీన మహేష్ తండ్రి కృష్ణ నటించిన ‘అగ్ని పర్వతం’ సినిమా రిలీజ్ అవ్వగా అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. , దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా.. వైజయంతీ మూవీస్ పతాకంపై చలసాని అశ్వనీదత్ నిర్మాతగా.. సూపర్‌స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దీనితో అదే తేదీన విడుదలైన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: