‘తేనె మనసులు’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి… సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకున్నారు కృష్ణ. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 1965 మార్చి 31న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేటితో ఈ సినిమా 55 వసంతాలను పూర్తి చేసుకుంది. అంతేకాదు ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. ఫస్ట్ 70 ఎమ్ఎమ్, ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్, ఫస్ట్ కౌబాయ్ ఇలా అన్నింటి సూపర్ స్టార్ పేరే ఉంటుంది. మొదటి కౌబాయ్, మొదటి జేమ్స్ బాండ్ సినిమా ఇలా ఏ కొత్త ప్రయోగం చేయాలన్నా సూపర్ స్టార్ కృష్ణ తర్వాతే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘నా ఆల్ టైమ్ ఫేవరెట్.. టైం లెస్ క్లాసిక్ ‘తేనె మనసులు’ సినిమానే. 55 సంవత్సరాల క్రితం ‘తేనె మనసులు’ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ ప్రయాణం మొదలైంది. వాట్ ఏ బ్లాక్ బస్టర్ బిగినింగ్.. ఈ సందర్భంగా… మన సూపర్‌స్టార్ యొక్క లెజెండరీ జర్నీ తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకుందాం’ అని మహేష్ పోస్ట్ చేసారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: