
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 54


అఖండ 2.. అదిరిపోయే అప్‌డేట్

శివాజీ, నవదీప్ హీరోలుగా 'దండోరా'

మా నాన్న మాట నాకు వేదవాక్కు - విష్ణు మంచు

మోహన్ బాబు, విష్ణు లైసెన్స్‌డ్ గన్స్ సీజ్

పుష్ప 2 ఓవర్సీస్ కలెక్షన్స్

సూర్య 45సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్

ఆర్‌ఆర్‌ఆర్.. స్పెషల్ డాక్యుమెంటరీ వస్తోంది

5వ రోజు కూడా అదుర్స్

చర్చనీయాంశంగా మంచు ఫ్యామిలీ వివాదం

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ - మహేష్ బాబు

నా టీంలో ఉన్న వారంతా సుకుమార్ లే

పుష్ప 2 ఇంత హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి గారే

పుష్ప 2.. మూడు రోజుల్లోనే కొట్టేసింది

చరిత్ర సృష్టించిన పుష్ప 2
టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ మూవీ గ్లోబల్ వైడ్‌గా దుమ్మురేపుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటోంది. నైజాంలో ఇప్పటికే 70కోట్ల షేర్‌ను క్రాస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీ బెల్ట్ లోనూ కుమ్మేస్తోంది.

అఖండ 2.. అదిరిపోయే అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా 'అఖండ 2'. 'తాండవం' అనేది ట్యాగ్‌లైన్‌గా ఉంది. 2021లో వీరి కలయికలోనే వచ్చిన 'అఖండ' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. కరోనా ప్రభావం తగ్గుతున్న సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

శివాజీ, నవదీప్ హీరోలుగా 'దండోరా'
ఇటీవలికాలంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. చేసే పనినిబట్టే కులం అన్నప్పుడు, పని మారితే కులం కూడా మారాలి కదా..? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దీనికి సమాధానంగా తెలంగాణ పల్లెలోని సంప్రదాయాలు, సంఘర్షణల నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ముప్పనేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రూరల్ కాన్సెప్టు బేస్డ్ మూవీలో బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, నవదీప్ హీరోలుగా నటిస్తున్నారు.

మా నాన్న మాట నాకు వేదవాక్కు - విష్ణు మంచు
తండ్రి మాట తనకు వేదవాక్కు అని పేర్కొన్నారు టాలీవుడ్ హీరో విష్ణు మంచు. ఈ మేరకు ఆయన తాజాగా తమ కుటుంబంలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు పలు కీలక విషయాలు వెల్లడించారు. తమ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు త్వరలోనే సమసిపోతాయని, త్వరలోనే తిరిగి అందరం కలిసిపోతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

జాతిరత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ కొత్త సినిమా
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం 'లైలా' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గత కొన్ని రోజులక్రితం ఈ మూవీ నుంచి లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ సేన్ పిక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్.

మోహన్ బాబు, విష్ణు లైసెన్స్‌డ్ గన్స్ సీజ్
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం తీవ్ర స్థాయికి చేరింది. గడచిన మూడు రోజులుగా ఆయనకు, చిన్న కుమారుడు హీరో మనోజ్‌కు మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి జల్ పల్లిలోని మంచు టౌన్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

గేమ్ ఛేంజర్.. 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.

పుష్ప 2 ఓవర్సీస్ కలెక్షన్స్
భారీ అంచనాల మధ్య గత వారంలో విడుదలైన పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా దుమ్మురేపుతోంది.వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లోనూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది దాంతో ఈసినిమా 1000కోట్ల మార్క్ కు చేరువైంది.నేషన్ వైడ్ గా ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఇక ఓవర్సీస్ లోకూడా సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.
పుష్ప 2 5 డేస్ కలెక్షన్స్.. తగ్గేదే లే
టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలిరోజు నుండే అదరగొడుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన పుష్ప 2 మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లను వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

సూర్య 45సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 45వ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈసినిమాలో సూర్య సరసన త్రిష నటిస్తుండగా ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈసినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ముందు ఏఆర్ రెహమాన్ ను తీసుకున్నారు.అయితే కారణాలు తెలియదు కానీ ఇప్పుడు తన స్థానంలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ను తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆర్‌ఆర్‌ఆర్.. స్పెషల్ డాక్యుమెంటరీ వస్తోంది
దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా ఆస్కార్ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

5వ రోజు కూడా అదుర్స్
అల్లు అర్జున్ పుష్ప 2 హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తుంది.ఇప్పటికీ మొత్తం మూడు సార్లు ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి రోజు 72 కోట్లతో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించగా మూడో రోజు 74కోట్ల తో ఈ రికార్డు బ్రేక్ చేసింది.ఇక ఆదివారం అయితే ఊహించని విధ్వంసం సృష్టించింది.ఏకంగా 86కోట్ల తో మరో సారి రికార్డు బ్రేక్ చేసి సింగిల్ డే హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.ఇక నిన్న వర్కింగ్ డే న కూడా ఇదే జోరు కొనసాగించింది. ఏకంగా 48కోట్ల నెట్ ను రాబట్టుకుంది.దాంతో 5 రోజుల్లో మొత్తం 339 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు అతి తక్కువ రోజుల్లో 300కోట్ల క్లబ్ లో…

ఓటీటీ లోకి వచ్చేసిన తంగలాన్
కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. భారీ నిర్మాణ విలువలు, పా రంజిత్ దర్శకత్వం, విక్రమ్ అద్భుత నటన వెరసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

చర్చనీయాంశంగా మంచు ఫ్యామిలీ వివాదం
టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీలలో ఒకటైన మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో రెండు రోజులక్రితం మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఆయన చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్ ఆదివారం గాయాలతో ఆసుపత్రిలో చేరడం సంచలనం రేపింది.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా కనిపించనుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో భయపెట్టనున్నారు.
ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ - మహేష్ బాబు
అప్ కమింగ్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్‌లో ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు ఈ మూవీ, పాత్ర కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో రివిల్ చేశారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

నా టీంలో ఉన్న వారంతా సుకుమార్ లే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

పుష్ప 2 ఇంత హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి గారే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

పుష్ప 2.. మూడు రోజుల్లోనే కొట్టేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు నుండే చరిత్ర సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లను వసూలు చేసి అందరినీ నివ్వెరపరిచింది.