టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ మూవీ గ్లోబల్ వైడ్‌గా దుమ్మురేపుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటోంది. నైజాంలో ఇప్పటికే 70కోట్ల షేర్‌ను క్రాస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీ బెల్ట్ లోనూ కుమ్మేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం పుష్ప 2 అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో 10 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఈ ఫీట్ సాధించిన నాలుగో సినిమాగా రికార్డు సృష్టించింది. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కూడా మంచి రన్ చూపిస్తోంది. మరోవైపు అటు ‘బుక్ మై షో’లో కోటికిపైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. ఇంత తొందరగా ఈ మైలురాయిని చేరుకోవడం ఏ సినిమాకైనా ఇదే మొదటిసారి.
విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపంకు, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది.
సినిమా తొలి రోజు నుంచే మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు.. నాలుగవ రోజు.. ఐదవ రోజు.. ఆరవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా మరో మైలురాయి అందుకుంది. ఈ సినిమా 1,000 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో తెలుగు సినిమాగా నిలిచింది. ఇంతకుముందు ‘బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడి’ చిత్రాలు 1,000 కోట్ల మార్క్ అందుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ.1002 కోట్లు వసూలు ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయితే పుష్ప 2 కేవలం 6 రోజుల్లోనే వెయ్యి కోట్లను దాటడం వండర్ అనే చెప్పాలి. వన్ వీక్ లోపే ఈ ఫీట్ సాధించడంతో ఫుల్ రన్‌లో ఎంత రాబడుతుందనేది ఆసక్తిగా మారింది.
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతిబాబు, సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ బండారి, సత్య, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: