టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘లైలా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గత కొన్ని రోజులక్రితం ఈ మూవీ నుంచి లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ సేన్ పిక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా మాస్ కా దాస్ మరో కొత్త సినిమాను షురూ చేశాడు. కాగా ఈ చిత్రానికి ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ డైరెక్షన్ చేయనుండటం విశేషం. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ క్రేజీ ప్రాజెక్టుని నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘ఫంకీ’ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా వేదికగా.. “మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరియు సూపర్ ఫన్ డైరెక్టర్ అనుదీప్ సినిమా ‘ఫంకీ’, నవ్వు తెప్పించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈరోజు పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా, సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది” అని పేర్కొంది.
ఇక ఈ మూవీలో ‘నా సామిరంగ’ ఫేమ్ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించనుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. త్వరలోనే ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు మరియు పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: