అల్లు అర్జున్ పుష్ప 2 హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తుంది.ఇప్పటికీ మొత్తం మూడు సార్లు ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి రోజు 72 కోట్లతో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించగా మూడో రోజు 74కోట్ల తో ఈ రికార్డు బ్రేక్ చేసింది.ఇక ఆదివారం అయితే ఊహించని విధ్వంసం సృష్టించింది.ఏకంగా 86కోట్ల తో మరో సారి రికార్డు బ్రేక్ చేసి సింగిల్ డే హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.ఇక నిన్న వర్కింగ్ డే న కూడా ఇదే జోరు కొనసాగించింది. ఏకంగా 48కోట్ల నెట్ ను రాబట్టుకుంది.దాంతో 5 రోజుల్లో మొత్తం 339 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు అతి తక్కువ రోజుల్లో 300కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా కూడా రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం పుష్ప 2,కల్కి 2898 ఏడి హిందీ లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసి అత్యధిక వసూళ్లను సాధించిన మూడో డబ్బింగ్ సినిమాగా కొనసాగుతుంది.ఈజాబితాలో 511కోట్ల తో భాహుబలి 2 మొదటి స్థానం లో 435 కోట్ల తో కెజియఫ్ 2 రెండో స్థానంలో వున్నాయి.ఫుల్ రన్ లో పుష్ప 2 ఈరెండు సినిమాల వసూళ్లను దాటేసి మొదటి స్థానంలో నిలువడం ఖాయం.ఇక ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను కూడా చేరుకోవడంతో ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకురానుంది.
పుష్పకు సీక్వెల్ గా సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: