అప్ కమింగ్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్‌లో ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు ఈ మూవీ, పాత్ర కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో రివిల్ చేశారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించబోతోంది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో అభిమానుల కోసం ఒక స్పెషల్ ట్రీట్ వేచి చూస్తోంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు.
అలాగే సినిమాలో కీలకమైన టాకా పాత్రకు హీరో సత్యదేవ్, టిమోన్ పాత్రకు అలీ, పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు. కాగా ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగులో ఇండియన్ థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ముఫాసాకి వాయిస్ ఇవ్వడం గురించి మహేష్ బాబు తన ఎక్సయిట్మెంట్ ని షేర్ చేసుకున్నారు. “ముఫాసా ఇప్పటివరకు వచ్చిన అత్యంత పాపులర్ పాత్రలలో ఒకటి. ఇది నాకు ఒక డ్రీం కం ట్రూ భావిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో చూస్తున్న పాత్రల్లో ఇది ఒకటి. అతను తన కుటుంబాన్ని చూసుకునే విధానం అద్భుతం. నేను అతని పాత్రను చూడటానికి ఎదురుచూస్తున్నాను” అన్నారు.
ఇంకా మహేష్ బాబు మాట్లాడుతూ.. “ఇది నిజంగా ఒక గౌరవం, ప్రతి తరానికి ఇష్టమైన పాత్ర ముఫాసా అని నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూస్తారని భావిస్తున్నాను. ఇది చాలా ఆనందాన్ని ఇస్తోంది, ఎ డ్రీమ్ కం ట్రూ” అని తన ఎక్సైట్‌మెంట్‌ని షేర్ చేసుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: