ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచమంతట కలిపి 294 కోట్లతో డే1 వసూళ్లతో రికార్డు సాధించింది. ప్రపంచమంతటా పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకెళ్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా ఈ ప్రెస్ మీట్ కు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. “అందరికీ థాంక్స్, ఈ సినిమాకు ఇంత విజయం ఇచ్చినందుకు. ముందుగా నేను రాజమౌళి గారికి థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాను ఇంతగా ప్రోత్సహించింది రాజమౌళి గారు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయాలని రాజమౌళి గారు అన్నారు. ధియేటర్ కు వచ్చిన వాళ్ళు 3 గంటలు అంతా మర్చిపోయి సినిమాను చూడాలి అని నేను, నా చిత్ర బృందం చాల కష్టపడి చేశాం” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఫాహద్ ఫజల్ సినిమా కోసం చాల కష్టపడ్డారు. మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తితో పని చేయడం చాలా అదృష్టం. అలాగే చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే నాకు 3 రోజులుగా ఆనందంగా లేదు. ఎందుకంటే జరిగిన ఘటన అలాంటిది. వారి కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం. మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: