ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచమంతట కలిపి 294 కోట్లతో డే1 వసూళ్లతో రికార్డు సాధించింది. ప్రపంచమంతటా పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకెళ్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా ఈ ప్రెస్ మీట్ కు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించడంలో నా టీం సహకారం వెలకట్టలేనిది. నాకు దొరికిన అసిస్టంట్ డైరెక్టర్స్ ఎవరికీ దొరకరు. వాళ్ళ జడ్జిమెంట్ కి చాలా విలువ ఇస్తాను. అలాగే బయట నుండి ఒక రైటర్ని నా డైరెక్షన్ టీంలోకి తీసుకున్నాను. ఏమైనా సమస్య వచ్చినా చాల వేగంగా తీరుస్తారు. తిరుపతి నుండి గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన వారిని తీసుకొచ్చారు నా డైరెక్షన్ టీం. 10 నిమిషాలలో సీన్ రాసే వాళ్ళు ఉన్నారు దర్శకత్వం టీంలో.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నా టీంలో ఉన్న వారు అంతా సుకుమార్ లే. అందరూ నాలాంటి దర్శకులే. సినిమా కోసం బాక్గ్రౌండ్ లో ఉండి పని చేసిన అందరి కష్టం నాకు తెలుసు. ఈ విజయానికి కారణం చిత్ర బృందం అందరిదీ. నా టీంలో నా అభిమానులు ఉండటం నా అదృష్టం. సినిమా ఎంత విజయం సాధిస్తుందో నా టీం ముందుగానే లెక్కలతో సహా చెప్పేశారు. హింది కూడా నా టీం మీద నమ్మకంతో పూర్తిగా వారికే అప్పగించాను. నా బృందంలో జర్నలిస్టు కూడా ఉండటం విశేషం. ఎడిటర్ కి స్క్రిప్ట్ ఎడిటింగ్ పై అవగాహన ఉండటం మాకు చాలా హెల్ప్ అయింది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: