డాకు మహారాజ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్

Nandamuri Balakrishna's Daaku Maharaaj Pre Release Event Date and Venue Fixed

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తుండగా.. ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవలే కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా చిత్ర టైటిల్‌ని ప్రకటించడంతో పాటు, టీజర్‌ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి అదిరిపోయే అప్‌డేట్ అందింది. డాకు మహారాజ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ ఫిక్స్ అయింది. యూఎస్‌ఏలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్ చేశారు మేకర్స్. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం లోని డల్లాస్‌ నగరంలో 2025 జనవరి 4న సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ జరుగనుంది.Texas Trust CU Theatre ఈవెంట్‌కు వేదిక కానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

ఇక ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. కాగా డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.