టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం తీవ్ర స్థాయికి చేరింది. గడచిన మూడు రోజులుగా ఆయనకు, చిన్న కుమారుడు హీరో మనోజ్‌కు మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి జల్ పల్లిలోని మంచు టౌన్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆయన మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో మోహన్ బాబు వద్ద గన్ ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయనతో పాటు పెద్ద కుమారుడు విష్ణు, మనోజ్ దగ్గర ఉన్న గన్ లైసెన్స్‌లను తక్షణం హోల్డ్ లో పెట్టి గన్స్ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా నిన్న ఉదయం మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే తమ్ముడు మనోజ్‌తో ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా మనోజ్‌తోపాటు ఆయన భార్య, వారి తరపు బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపేసి గేట్లు వేసేశారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తమకు భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయించారు.
ఈ క్రమంలో ఇంటలిజెన్స్ డీజీ, డీజీపీతో పాటు రాచకొండ కమిషనర్ తదితరులను కలిసి తమ కుటుబంంలో నెలకొన్న వివాదం గురించి, తనపై జరిగిన దాడుల గురించి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నేరుగా ఆయన జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వచ్చారు. అయితే ఈ సందర్భంగా మనోజ్, మౌనిక దంపతులను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్‌బాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
దీంతో ఆగ్రహించిన మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఇంట్లోనుంచి బయటికి వచ్చిన మోహన్‌బాబు అప్పటికే అక్కడున్న మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ చానల్ ప్రతినిధికి ఫ్రాక్చర్ కాగా, పలువురికి గాయాలు అయ్యాయి.
దీంతో జర్నలిస్టు సంఘాలు మోహన్‌బాబు వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని పలువురు జర్నలిస్టు నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జల్ పల్లి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.
ఇక ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఫిల్మ్‌నగర్ పోలీసులు ఉన్నతాధికారుల సూచనల మేరకు మోహన్‌బాబు, విష్ణుల లైసెన్స్ గన్‌లను స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ముగ్గురికీ రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ముందుజాగ్రత్తగా మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ పరిణామాల క్రమంలో మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: