ఆర్‌ఆర్‌ఆర్‌.. స్పెషల్ డాక్యుమెంటరీ వస్తోంది

RRR Producers Announced Special Documentary on SS Rajamouli's Film

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా ఆస్కార్‌ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాతో ఈ ఇద్దరికీ వరల్డ్ వైడ్‌గా సూపర్ హీరోలుగా గుర్తింపు లభించింది. అలాగే ఆస్కార్ కమిటీలో యాక్టర్స్ లిస్టులో వీరికి చోటు కూడా దక్కింది. ఈ ఏడాది ప్రకటించనున్న ఉత్తమ నటీనటుల కేటగిరిలో వీరి ఓటు కీలకం కానుంది.

ఇంతటి విశేష ప్రాముఖ్యత కలిగిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ అందింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై ఓ స్పెషల్ డాక్యుమెంటరీ వస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ విశేషాలతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు మేకర్స్‌. అలాగే ఈ డాక్యుమెంటరీని ఈ నెలలోనే విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ‘ఇప్పటికే ప్రపంచం ఈ సినిమా తాలూకు వైభవాన్ని చూసింది. అసలు దీని వెనక కథేమిటో చూడండి’ అంటూ డాక్యుమెంటరీ గురించి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టింది. హాలీవుడ్ ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ ‘ఇంటర్‌స్టెల్లార్‌’ తరహాలో ఆర్‌ఆర్‌ఆర్‌ డాక్యుమెంటరీని కూడా కొన్ని ప్రత్యేక స్క్రీన్లలో ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మేకింగ్‌ సందర్భంగా జరిగిన సంఘటనలు, పోరాట ఘట్టాల రూపకల్పనకు సంబంధించిన విశేషాలతో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇక మేకర్స్ ప్రకటనతో ఈ మూవీ మరోసారి వార్తల్లోకెకింది. దీంతో విషయం తెలిసిన మూవీ లవర్స్ దీనిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలావుంటే, రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.