తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 45వ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈసినిమాలో సూర్య సరసన త్రిష నటిస్తుండగా ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈసినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ముందు ఏఆర్ రెహమాన్ ను తీసుకున్నారు.అయితే కారణాలు తెలియదు కానీ ఇప్పుడు తన స్థానంలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ను తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయి అభ్యంకర్ కు కనీసం ఒక్క సినిమా అనుభవం కూడా లేదు.ప్రస్తుతం తను, లోకేష్ కనగరాజ్ నిర్మిస్తున్న బెంజ్ అనే సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఈ ప్రాజెక్ట్ పూర్తికాకముందే సాయి అభ్యంకర్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు.ఇక ఇంతకుముందు కచ్చి సెరా ,ఆశ కూడా పాటలతో పాపులర్ అయ్యాడు సాయి అభ్యంకర్. మరి ఇప్పుడు సూర్య 45 కు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడోని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..డ్రీం వారియర్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈసినిమా కన్నా ముందు సూర్య తన 44వ సినిమా తో రానున్నాడు.కార్తీక్ సుబ్బరాజ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సూర్య లుక్ కూడా డిఫ్రెంట్ గా ఉండనుంది.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుండగా శ్రీయ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.2డి ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మిస్తుంది.వచ్చే ఏడాది వేసవి లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.త్వరలోనే టైటిల్ ను రివీల్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: