గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా ‘అఖండ 2’. ‘తాండవం’ అనేది ట్యాగ్‌లైన్‌గా ఉంది. 2021లో వీరి కలయికలోనే వచ్చిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. కరోనా ప్రభావం తగ్గుతున్న సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాడు థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు బద్దలయ్యాయంటే.. ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో బాలయ్య కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పీక్స్‌కి వెళ్లిపోయింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలను నందమూరి అభిమానులు అనేకసార్లు బోయపాటిని కోరారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కోరిక నెరవేర్చేలా ఆయన అఖండ 2 కథ సిద్ధం చేశారు. ఇక ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మేకర్స్ అఖండ 2 టైటిల్ పోస్టర్‌ని విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌లో హిమాలయ పర్వతాలు కనిపిస్తుండగా.. టైటిల్‌కి రుద్రాక్ష కట్టబడి, స్ఫటిక లింగంతో దైవికత ఉట్టిపడేలా ఉంది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సింహ, లెజెండ్ మరియు అఖండ చిత్రాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో ఈ మూవీ వస్తుండటంతో దీనిపై అంతటా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా అదిరిపోయే అప్‌డేట్ అందించింది. వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 థియేటర్లలోకి రానున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ ప్రోమో విడుదల చేసింది. ఈ ప్రోమో వీడియోలో చేతిలో త్రిశూలం ధరించి ఉగ్ర రూపంలో ఉన్న పరమశివుడిని గ్రాఫిక్స్ రూపంలో ఆవిష్కరించారు. అలాగే చివరిలో మూర్తీభవించిన తేజస్సుతో వెలిగిపోతున్న అమ్మవారి విగ్రహాన్ని చూపించారు. థమన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది.
ఇక ఈ రిలీజ్ డేట్ ప్రోమో అయితే సినిమాపై అంచనాలను పెంచేలావుంది. కాగా అఖండ 2 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోండగా.. హీరో బాలకృష్ణ మొదటి రోజు జాయిన్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా బోయపాటి తన సాధారణ శైలిలో, ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో ఉత్కంఠభరితమైన పోరాట సన్నివేశంతో షూట్‌ను ప్రారంభించాడు.
అయితే ఈ సీక్వెల్‌పై విపరీతమైన అంచనాలు ఉన్నందున దర్శకుడు బోయపాటి శ్రీను, అఖండ 2 కథ హైప్‌కు అనుగుణంగా ఉండేలా చూస్తున్నాడు. దీనిలో భాగంగా ప్రీ-ప్రొడక్షన్ సమయం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ప్రతి విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. పకడ్బందీ కథనంతో పాటు అద్భుతమైన సంభాషణలు కూడా పొందుపరచనున్నారు. ఇక ఈ చిత్రంలో స్టార్ తారాగణం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఇక ఈ చిత్రానికి బాలయ్య చిన్న కుమార్తె ఎమ్. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటం విశేషం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుండగా.. బాలకృష్ణ, బోయపాటి ఇద్దరికీ ఇది తొలి పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: