భారీ అంచనాల మధ్య గత వారంలో విడుదలైన పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా దుమ్మురేపుతోంది.వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లోనూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది దాంతో ఈసినిమా 1000కోట్ల మార్క్ కు చేరువైంది.నేషన్ వైడ్ గా ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఇక ఓవర్సీస్ లోకూడా సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు తో నార్త్ అమెరికా లో 10 మిలియన్ డాలర్ల కు పైగా రాబట్టింది. దాంతో ఈ ఫీట్ సాధించిన నాలుగో సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది.తెలుగు వెర్షన్ తోపాటు అక్కడ హిందీ వెర్షన్ కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 5మిలియన్ డాలర్లను రాబట్టాల్సివుంది. ఇక అలాగే ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ దేశాల్లో కూడా మంచి రన్ ను కనబరుస్తుంది.
అటు బుక్ మై షో లో కోటికిపైగా టికెట్లు అమ్ముడయ్యాయి.ఇంత తొందరగా ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే మొదటి సారి. అలాగే నైజాంలో 70కోట్ల షేర్ ను క్రాస్ చేసింది. ఓవరాల్ గా రేపటి తో ఈసినిమా 1000కోట్ల క్లబ్ లో చేరనుంది. దాంతో ఈ ఫీట్ సాధించిన నాలుగో తెలుగు సినిమాగా నిలువవుంది. ఇంతకుముందు బాహుబలి 2 ,ఆర్ఆర్ఆర్ , కల్కి 2898ఏడి ఈ ఫీట్ సాధించాయి.మరి ఫుల్ రన్ లో పుష్ప 2 ఎంత రాబడుతుందనేది ఆసక్తిగా మారింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: