ఓటీటీ లోకి వచ్చేసిన తంగలాన్

Chiyaan Vikram's Thangalaan Now Streaming on OTT

కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. భారీ నిర్మాణ విలువలు, పా రంజిత్ దర్శకత్వం, విక్రమ్ అద్భుత నటన వెరసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తెలుగులోనూ తంగలాన్ స్ట్రైట్ సినిమాలతో పాటు విడుదలై గట్టి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడింది. వన్ వీక్ స్ట్రాంగ్ హోల్డ్‌తో మంచి కలెక్షన్స్ అందుకుంది. దీంతో తంగలాన్ సినిమా కోసం ఓటీటీ ప్రియులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ సడన్‌గా ఓటీటీ లోకి వచ్చేసి సర్‌ప్రైజ్‌ చేసింది.

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోకి తంగలాన్ ఎంట్రీ ఇచ్చింది. మంగళవారం ఉదయం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మాతృక తమిళం సహా తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. సో మూవీ లవర్స్.. ఇంకెందుకు ఆలస్యం? థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించండి.

తంగలాన్ కథ ఏంటంటే..?

స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ కాలం నాటి ఈ కథ వెప్పూర్ అనే గ్రామంలో మొదలవుతుంది. అక్కడ కథానాయకుడు తంగలాన్‌ (విక్రమ్), భార్య (పార్వతి తిరువోతు), పిల్లలతో కలిసి జీవిస్తుంటాడు. అయితే కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అతను తన భూమిని కోల్పోయి బానిసలుగా మారాల్సి వస్తుంది. మరోవైపు బ్రిటిష్ దొర క్లెమెంట్, వేప్పూర్ సమీపంలోన అడవిలో ఉన్న బంగారు గనులు తవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.

కానీ అక్కడ దెయ్యాలున్నాయని, అడవి మనుషులు చంపేస్తారనే భయంతో ఎవరూ ముందుకు రారు. ఈ క్రమంలో బంగారం వెతికి పెట్టమని బ్రిటిష్ దొర తంగలాన్‌కి సంబంధించిన తెగ దగ్గరకు వస్తాడు. అయితే ఆ బంగారు గనులకి కాపాలా కాస్తున్న ఆరతి (మాళవిక మోహనన్) నుంచి పెద్ద ప్రమాదాలు ఎదురవుతాయి. మరి ఆరతి నుంచి తప్పించుకుని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు? అసలు తంగలాన్ ఎవరు? చివరకు తంగలాన్ ఏ నిజం తెలుసుకున్నాడు? అనేది మిగిలిన కథ.

కాగా తంగలాన్ చిత్రాన్ని నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో మ్యాజికల్ రియలిజం స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన తంగలాన్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.