టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీలలో ఒకటైన మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో రెండు రోజులక్రితం మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఆయన చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్ ఆదివారం గాయాలతో ఆసుపత్రిలో చేరడం సంచలనం రేపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా తండ్రితో పాటు ఆయన సహాయకుడు తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ డాక్టర్లకు చెప్పినట్టు వార్తలు వినిపించాయి. ఇందుకు సంబంధించి మీడియాలో మనోజ్ ఇబ్బందిపడుతూ నడుస్తూ ఆస్పత్రిలోకి వెళ్తున్న విజువల్స్ కూడా వచ్చాయి. ఇక చికిత్స అనంతరం ఆయన ఇంటికి వెళ్లిపోయారు. ఇంటిచుట్టూ పెద్ద ఎత్తున బౌన్సర్లను నియమించుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్
అయితే మనోజ్ సోమవారం హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. ఇందులో గుర్తుతెలియని పది మంది వ్యక్తులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేసి పరారయ్యారని, ఈ దాడిలో తాను తీవ్రంగా గాయపడ్డానని తెలిపిన ఆయన ఇందుకు సాక్ష్యంగా ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు రిపోర్ట్‌లను కూడా జత చేశారు. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు, పోలీసులకు లేఖ
ఈ నేపథ్యంలో మోహన్ బాబు తనయుడు మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ ద్వారా రాచకొండ సీపీకి ఫిర్యాదు అందజేశారు. తన కొడుకు మంచు మనోజ్ మరియు అతని భార్య మౌనిక నుంచి తనకి ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తనకి రక్షణ కల్పించాల్సిందిగా లేఖలో విన్నవించారు. ఇక త్వరలోనే పోలీస్ స్టేషన్‌కి వచ్చి లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేస్తానని కూడా అందులో పేర్కొన్నారు.
తండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ వివరణ
సోమవారం అర్థరాత్రి మంచు మనోజ్ ఎక్స్ వేదికగా దీనిపై ఓ పోస్టు పెట్టారు. అందులో ‘‘నా పై, నా భార్య మౌనికపై మా నాన్న చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం. నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో ఇదొక భాగం. నా గొంతు బలంగా వినిపించకుండా, కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేేస ప్రయత్నమిది’’ అని పేర్కొంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
అంతేకాకుండా దీనిని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్, భట్టి విక్రమార్క మరియు హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్ లకు ట్యాగ్ చేశారు. ఈ వ్యవహారంపై పారదర్శకమైన మరియు న్యాయమైన విచారణ ద్వారా న్యాయం చేయాలని వినయపూర్వకంగా అభ్యర్ధించారు.
కాగా మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కుటుంబ ఆస్తులను తన వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకుంటున్నాడని మనోజ్ ప్రధాన ఆరోపణగా ఉంది. ఫ్యామిలీ ప్రాపర్టీని విష్ణు దుర్వినియోగం చేశాడని, స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే తన తండ్రి మాత్రం తనను పక్కకు తప్పించి విష్ణుకు మద్దతుగా నిలుస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: