తండ్రి మాట తనకు వేదవాక్కు అని పేర్కొన్నారు టాలీవుడ్ హీరో విష్ణు మంచు. ఈ మేరకు ఆయన తాజాగా తమ కుటుంబంలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు పలు కీలక విషయాలు వెల్లడించారు. తమ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు త్వరలోనే సమసిపోతాయని, త్వరలోనే తిరిగి అందరం కలిసిపోతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విష్ణు మంచు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. ఇలాంటి పరిస్థితి మా ఫ్యామిలీకి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఎక్కువసేపు మాట్లాడితే నేను బ్రేక్ డౌన్ అవుతాను. ఇది చాలా బాధాకరం. మా నాన్న మీడియా అంటే చాలా గౌరవం. ప్రతి ఇంట్లో సమస్యలు సహజం. అయితే ఎవరో ఒకరు తగ్గి ఇవి రిజాల్వ్ అవ్వాలని ఇంటిలోని పెద్దలు కోరుకుంటారు.”
‘మా నాన్న చేసిన ఒకే ఒక్క తప్పు.. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం. ఈ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలోని వారందరికీ తెలుసు. అందరిలా కాకుండా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ కుటుంబంలో కొన్ని విభేదాలు తలెత్తాయి. ఇది అన్ని ఫ్యామిలీలలో జరుగుతుంది. కొన్న్ని మీడియా ఛానల్స్ దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయి. మీడియా మిత్రులు అర్ధం చేసుకుని దీనిని సెన్సేషన్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను.”
“ఈ గొడవల వలన మా అమ్మగారు ఆస్పత్రిలో చేరారు. మరోవైపు మా నాన్నకు నిన్న రాత్రి జరిగిన ఘర్షణలో గాయాలవడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశాం. ఇంటికి పెద్ద కొడుకుగా నేను ఇవన్నీ దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. నేను ‘కన్నప్ప’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసమై లాస్ ఏంజిల్స్‌లో ఉండగా ఇంటినుంచి ఫోన్ వచ్చింది. అన్నీ పక్కనపెట్టేసి వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేశాను.”
“మీడియా పర్సన్‌కు గాయాలవడం బాధాకరం. అయితే అది ఇంటెన్షనల్‌గా చేసింది కాదు. మా నాన్న తొలుత మీడియా వారికి నమస్కరిస్తూ వచ్చారు. అయితే ముఖంపై కెమెరాలు, మైకులు ఏదో పెట్టారని.. అలా జరిగిపోయింది. మేం అతని ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నాము. అయితే మీడియాలో అందరూ కాదు కానీ, కొంతమంది హద్దు మీరుతున్నారు. లైన్ క్రాస్ అవుతున్నారు. ఇది మంచిది కాదు.”
“ప్రేమతో గెలవాల్సిన విషయాలను రచ్చ చేసుకుంటే ఏది జరగదు. మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేది ఏమీ లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు పబ్లిక్‌గా మాట్లాడను. నేను ఇక్కడ ఉండిఉంటే.. విషయం ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. తమ్ముడి పెళ్లి శుభకార్యం. వారు ఒక బిడ్డను కన్నారు. దాని గురించి ఎవరూ ఫీలవరు.”
“లోపల తండ్రి స్థాయి వ్యక్తి ఉంటే తలుపులు బద్దలు కొడతారా? తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీకి ఎంతో పేరుంది. అది మాకు దేవాలయం. ఇండియాకు ఫారిన్ యూనివర్సిటీలను తీసుకువచ్చిన ఘనత మాదే. మోహన్ బాబు గారిని నమ్మి అక్కడ తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. మా అక్కకు, నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కొట్టినా తిట్టినా నేను పడతాను. ఎందుకంటే తను నాకు అక్క, నాకంటే పెద్దది కాబట్టి.”
“ఇక నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయం కృషితో గొప్ప స్థాయికి ఎదిగారు. మాకిచ్చే, లభించే గౌరవం ఆయన వల్లే.. మోహన్ బాబు పిల్లలుగానే. కుటుంబం పరంగా నాన్నగారు ఏది అనుకుంటే అదే జరగాలి. తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయాలి. వినయ్ గారు నాకు అన్న లాంటి వారు.. ఆయన ఎవరిపైనా చేయి చేసుకోలేదు. ఆయనతో నాకు 15 ఏళ్లుగా పరిచయం ఉంది. ఇండియాలోనే గొప్ప స్దాయి ఉన్న వ్యక్తి.”
“అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఎడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు. ఇది మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అవ్వొచ్చు. మా ఫ్యామిలీ మ్యాటర్‌లో బయటి వ్యక్తుల ప్రమేయం ఉంటే, వారికి ఈరోజు సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నా. వారంతట వారే తప్పుకుంటే మంచిది. లేదంటే, అందరి పేర్లు నేనే బయటపెడతాను. సమయమే అన్ని సమస్యలకు సమాధానం ఇస్తుంది” అని ముగించారు విష్ణు మంచు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: