గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా కనిపించనుండగా.. ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో భయపెట్టనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ హై ఎక్స్‌పెక్టేషన్ ప్రాజెక్టును శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై యంగ్ ప్రొడ్యూసర్స్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇటీవలే కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా చిత్ర టైటిల్‌ని ప్రకటించడంతో పాటు, టీజర్‌ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. ఈ మేరకు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ, సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో భాగంగా ముచ్చటించుకుంటున్న పిక్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
అయితే వీరి కాంబోలో ఇంతకుముందు వచ్చిన చిత్రాల పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బాలయ్య బాబు సినిమా అంటే, థమన్ ఏ రేంజ్‌లో సాంగ్స్ ఇస్తాడో తెలిసిందే. ఇక బీజీఎమ్ అయితే చెప్పనక్కరలేదు. థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలైపోవాల్సిందే. నందమూరి అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడం పక్కా.
ఇకఇదిలావుండగా, డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. యూఎస్‌ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లోని డల్లాస్ నగరంలో వచ్చే జనవరి 4న సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ జరుగనుంది.Texas Trust CU Theatre ఈవెంట్‌కు వేదిక కానుంది.
ఇక ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. కాగా డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: