ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 89
రామ్ 'రెడ్' థ్రిల్లర్ మాత్రమే కాదు..!
రకుల్ ప్రీత్ స్వీట్ మెమొరీ
బెల్లీ డ్యాన్సర్ జాన్వీ కపూర్
యాక్షన్ ఎంటర్ టైనర్ "లక్ష్మీ "

'కపటధారి' ట్రైలర్ రిలీజ్

విజయ్ సేతుపతి - కత్రినా కాంబినేషన్లో సినిమా..?

సునీత-రామ్ కు నాగబాబు విషెస్
అమృత అయ్యర్ డబుల్ ధమాకా
స్మిమ్మర్ కాని స్విమ్మర్ నభా నటేష్
“పెళ్ళిసందD” మూవీలో హీరోయిన్ ఫిక్స్
భాగ్యనగరంలో షూటింగ్స్ సందడి

25 సంవత్సరాలుపూర్తి చేసుకున్న "పెళ్ళిసందడి "
త్రివిక్రమ్ తో సినిమా ఉంది.. కానీ..!
పవన్ కళ్యాణ్ కు జోడీగా సాయి పల్లవి ?

భారీ ప్రమోషన్స్ తో "RED "
'జాంబిరెడ్డి' రిలీజ్ డేట్ ఫిక్స్
'బంగారు బుల్లోడు' రిలీజ్ డేట్ ఫిక్స్
రామ్ చరణ్ అభిమానులు హ్యాపీ
శృతి హాసన్ సంక్రాంతి ముచ్చట్లు
"విరాటపర్వం"సంక్రాంతి పోస్టర్ రిలీజ్
సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ "మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 90 నాటి తెలంగాణ నక్సల్ మూమెంట్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ "విరాట పర్వం "మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో రానా కామ్రేడ్ రవన్న గా నటించిన ఈ మూవీ లో ప్రియమణి, నందితాదాస్ , నివేత పేతురాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
రామ్ 'రెడ్' థ్రిల్లర్ మాత్రమే కాదు..!
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా 'రెడ్ '. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్’ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్, ట్రైలర్‌లతో పాటు ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లు తిరిగి ప్రారంభం కావడంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
రకుల్ ప్రీత్ స్వీట్ మెమొరీ
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తండ్రీ కొడుకుల ఎమోషన్ నేపథ్యం లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "నాన్నకు ప్రేమ తో"మూవీ 2016 సంవత్సరం జనవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జగపతి బాబు , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరోఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
బెల్లీ డ్యాన్సర్ జాన్వీ కపూర్
బ్లాక్ బస్టర్ "ధడక్" మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ "మూవీ లో ఫైటర్ పైలట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకులను అలరించారు. జాన్వీ కథానాయికగా నటించిన "రుహి అఫ్జానా" మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. "దోస్తానా 2" మూవీ లో జాన్వీ కథానాయికగా నటిస్తున్నారు.
యాక్షన్ ఎంటర్ టైనర్ "లక్ష్మీ "
శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి వి వినాయక్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "లక్ష్మీ " మూవీ 2006 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నయనతార , ఛార్మి కథానాయికలు కాగా శర్వానంద్ , రాజీవ్ కనకాల , బ్రహ్మానందం , సునీల్ , వేణు మాధవ్ ముఖ్య పాత్రలలో నటించారు. రమణ గోగుల సంగీతం అందించారు. "లక్ష్మీ " మూవీతో నయనతార కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

'కపటధారి' ట్రైలర్ రిలీజ్
ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు 'కపటధారి' అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

విజయ్ సేతుపతి - కత్రినా కాంబినేషన్లో సినిమా..?
హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే వైవిధ్యమైన నటుడిగా గుర్తుంపు తెచ్చుకున్నారు విజయ్. విజయ్ సేతుపతి కోసం డైరెక్టర్స్ ప్రత్యేకమైన పాత్రలు రాసే స్థాయికి ఎదిగాడు. అంతేకాదు కేవలం ఒక్క భాషకే అంకితం కాకుండా.. పలు భాషల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు. తమిళ్ లో పలు సినిమాలు చేస్తూనే ఇతర లాంగ్వేజస్ లో చేస్తున్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

సునీత-రామ్ కు నాగబాబు విషెస్
సింగర్ సునీత, డిజిటల్ కంపెనీ అధినేత రామ్ వీరపనేని వివాహం రెండు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే కదా. శంషాబాద్ దగ్గరలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వేదికగా వీరి పెళ్లి జరిగింది. ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు.. టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అమృత అయ్యర్ డబుల్ ధమాకా
కామర్స్ డిగ్రీ హోల్డర్, మోడల్ అమృత అయ్యర్ "పడై వీరన్"తమిళ మూవీ తో కథానాయికగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "బిగిల్ "తమిళ మూవీ తో అమృత గుర్తింపు పొందారు. స్టార్ యాంకర్ ప్రదీప్ హీరోగా రూపొందిన "30 రోజులలో ప్రేమించడం ఎలా ?" మూవీ లో అమృత కథానాయికగా నటించారు. ఆమూవీ జనవరి 29 వతేది రిలీజ్ కానుంది. అనూప్ రూబెన్స్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
స్మిమ్మర్ కాని స్విమ్మర్ నభా నటేష్
భరత నాట్యం డ్యాన్సర్ , మోడల్ నభా నటేష్ సూపర్ హిట్ "వజ్రకాయ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. "నన్ను దోచుకుందువటే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోయిన్ గా గుర్తింపు పొందారు. సూపర్ హిట్ "సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ లో అమృత పాత్రలో తన పెర్ఫార్మెన్స్ తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " తెలుగు రీమేక్ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
“పెళ్ళిసందD” మూవీలో హీరోయిన్ ఫిక్స్
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన “పెళ్ళి సందడి “(1996 ) మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులను అలరించిన “పెళ్ళి సందడి “మూవీ సీక్వెల్ “పెళ్ళిసందD” మూవీ తెరకెక్కుతుంది. ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోనంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా “పెళ్ళిసందD” మూవీ రూపొందుతుంది.
భాగ్యనగరంలో షూటింగ్స్ సందడి
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలల పాటు చిత్ర పరిశ్రమ అనేక నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. థియేటర్స్ మూతబడి , షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు పలు ఇబ్బందులు పడ్డాయి. సినీ సెలబ్రిటీస్ షూటింగ్స్ లేక ఇళ్ళకే పరిమితం అయ్యారు. షూటింగ్స్ లేక స్టూడియోస్ , షూటింగ్ స్పాట్స్ కళ తప్పాయి. లాక్ డౌన్ సడలింపులలో షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో కొన్ని నెలల తరువాత షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. థియేటర్స్ ఓపెన్ కావడంతో ప్రేక్షకులు , నిర్మాతలు రిలీఫ్ ఫీల్ అయ్యారు.

25 సంవత్సరాలుపూర్తి చేసుకున్న "పెళ్ళిసందడి "
శ్రీ రాఘవేంద్ర కార్పొరేషన్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి , దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పెళ్ళిసందడి " మూవీ 1996 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. 3 నంది అవార్డ్స్ అందుకున్న "పెళ్ళిసందడి " మూవీకి కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను అలరించి "పెళ్ళిసందడి " మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
త్రివిక్రమ్ తో సినిమా ఉంది.. కానీ..!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ చాలా క్రేజీ గా ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్న మరో క్రేజీ కాంబినేషన్ త్రివిక్రమ్-రామ్ ది. గతకొద్ది రోజులుగా వీరిద్దరి కాంబినేషన్ పై సినిమా వస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈవిషయం పై క్లారిటీ ఇచ్చాడు రామ్.
పవన్ కళ్యాణ్ కు జోడీగా సాయి పల్లవి ?
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ , బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తెలంగాణ యువతి భానుమతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని, బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం ", "శ్యామ్ సింగ రాయ్ "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఇప్పుడు ఒక మలయాళ సూపర్ హిట్ మూవీ తెలుగు రీమేక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

భారీ ప్రమోషన్స్ తో "RED "
ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
'జాంబిరెడ్డి' రిలీజ్ డేట్ ఫిక్స్
కొత్త సంవత్సరంలో కొత్త సినిమాల సందడి మొదలైంది. వరుస పెట్టి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇక సంక్రాంతి బరిలో ఉన్న నాలుగు సినిమాల్లో ఒక సినిమా క్రాక్ ఇప్పటికే రిలీజ్ అయింది. అంతేకాదు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వీటితోపాటు మరికొన్ని సినిమాలు జనవరిలో రిలీజ్ అవ్వడానికి క్యూ కడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.
'బంగారు బుల్లోడు' రిలీజ్ డేట్ ఫిక్స్
ఇటీవల హీరోగా సరైన హిట్ లేక వెనకపడిపోయిన అల్లరి నరేశ్ తాజాగా ‘బంగారు బుల్లోడు’ సినిమాతో రావడానికి సిద్ధమయ్యారు. గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఆ రోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తుంది. గత కొద్దిరోజులుగా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కొద్ది సేపటి క్రితం ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు…
రామ్ చరణ్ అభిమానులు హ్యాపీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్, తారాగణం తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న "ఆచార్య "మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. రామ్ చరణ్ హీరో గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
శృతి హాసన్ సంక్రాంతి ముచ్చట్లు
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ 3 సంవత్సరాల తరువాత కథానాయికగా నటించిన "క్రాక్ " మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ ", విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన "లాభం "తమిళ మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేశారు.