విజయ్ సేతుపతి – కత్రినా కాంబినేషన్లో సినిమా..?

Vijay Sethupathi and Katrina Kaif To Pair Up For The First Time For Sriram Raghavan Movie

హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే వైవిధ్యమైన నటుడిగా గుర్తుంపు తెచ్చుకున్నారు విజయ్. విజయ్ సేతుపతి కోసం డైరెక్టర్స్ ప్రత్యేకమైన పాత్రలు రాసే స్థాయికి ఎదిగాడు. అంతేకాదు కేవలం ఒక్క భాషకే అంకితం కాకుండా.. పలు భాషల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు. తమిళ్ లో పలు సినిమాలు చేస్తూనే ఇతర లాంగ్వేజస్ లో చేస్తున్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బాలీవుడ్ లో కూడా సినిమా ఛాన్స్ లు కొట్టేసాడు. ‘అంధాదున్’ సినిమాతో శ్రీరామ్ రాఘవన్ బాలీవుడ్ లో మంచి హిట్ కొట్టాడు. ఆమధ్య దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఓ భారీ హిందీ చిత్రాన్ని ప్రకటించాడు. వరుణ్ ధావన్ హీరోగా ‘ఎక్కిస్’ పేరిట రూపొందే ఆ చిత్రం భారీ బడ్జెట్టుతో నిర్మాణం జరుపుకుంటుందని పేర్కొన్నారు. అయితే, కరోనా కారణంగా చిత్రాన్ని ప్రస్తుతం పక్కన పెట్టారు.

ఇప్పుడు ఈ డైరెక్టర్ తో విజయ్ సేతుపతి – కత్రినా కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇది తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుందని అంటున్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =