ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 90
'క్రిష్'సినిమా మొదలుపెట్టిన పవన్
టాక్ ఆఫ్ ది టాలీవుడ్ "క్రాక్ "
ఎఫ్3 షూట్ లో జాయిన్ అయిన వరుణ్
లవ్ స్టోరీ టీజర్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు
సుక్కూ కి బన్నీ మహేష్ బర్త్ డే విషెస్
'డ్రైవర్ జమున' గా టాలెంటెడ్ హీరోయిన్
నిధి డ్యాన్స్ రిహార్సల్స్
ట్రెండింగ్ లో సాయి పల్లవి డ్యాన్స్ స్టెప్
కీర్తి సురేష్ నో మేకప్ సెల్ఫీ
ఏడాది పూర్తి చేసుకున్న 'సరిలేరు నీకెవ్వరు'

హీరో రామ్ 15 ఇయర్స్ సినీ కెరీర్ పూర్తి
నాకు నేనే పోటీ - రకుల్ ప్రీత్
రాజకీయాల్లోకి రాలేను.. అర్థంచేసుకోండి
"లవ్ స్టోరీ " టీజర్ రిలీజ్
30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? రిలీజ్ డేట్ ఫిక్స్
'చావు కబురు చల్లగా' టీజర్ గ్లింప్స్ రిలీజ్
మారిన రిలీజ్ డేట్
ఘనంగా జరిగిన సునీత వివాహం

"గుర్తుందా శీతాకాలం " సెట్స్ లో తమన్నా
'అల వైకుంఠపురములో' టీం రీయూనియన్
త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ కు బన్నీ లాంటి హీరో దొరికితే ఆ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే వారు నిరూపించారు. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు మూడు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇక గత ఏడాది సమ్మర్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్, పూజ గ్లామర్ అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది థమన్ సాంగ్స్ గురించి. ఈ సాంగ్స్ యూ…
'క్రిష్'సినిమా మొదలుపెట్టిన పవన్
గత రెండేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. ఇంక సినిమాలు చేయను అని చెప్పిన పవన్ మొత్తానికి మనసు మార్చుకొని వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒకదాని తర్వాత ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు వకీల్ సాబ్ సినిమాతో బిజీగా వున్నాడు పవన్. ఇక అలా 'వకీల్ సాబ్' సినిమా పూర్తవుతుందో లేదో ఇలా వెంటనే క్రిష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు పవన్. పవర్ స్టార్ తన 27వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు జరుపుకోగా కరోనా వలన షూట్ కు బ్రేక్ పడింది. పవన్ బర్త్‌డే సందర్భంగా పవన్ ప్రీ లుక్ విడుదల చేసిన తర్వాత…
టాక్ ఆఫ్ ది టాలీవుడ్ "క్రాక్ "
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగావాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
ఎఫ్3 షూట్ లో జాయిన్ అయిన వరుణ్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇప్పటికే వెంకటేష్ తో షూటింగ్ జరుపుతున్నాడు అనిల్.
లవ్ స్టోరీ టీజర్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
సుక్కూ కి బన్నీ మహేష్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ లో ఉన్న బ్రిలియంట్ డైరెక్టర్స్ లలో సుకుమార్ ఒకరని చెప్పొచ్చు. ఈ సినిమాల్లో లాజిక్స్, క్యాలిక్యులేషన్ తోపాటు కొత్తగా ఉంటాయి. ఇక ఈరోజు సుకుమార్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సుక్కూకి టాలీవుడ్ నుండి చాలా మంది సెలెబ్రిటీస్ బర్త్ డే విషెస్ తెలియచేసారు. ఈ నేపథ్యంలో అల్లుఅర్జున్, మహేష్ బాబు సుకుమార్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
'డ్రైవర్ జమున' గా టాలెంటెడ్ హీరోయిన్
విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. కౌసల్యాకృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఈఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ తో అలరించిన ఐశ్వర్య ఆ సినిమాతో మరిన్ని ఛాన్స్ లు కొట్టేసింది. ప్రస్తుతం ఐశ్వర్యరాజేశ్ ప్రస్తుతం నానితో కలిసి టక్ జగదీష్ చిత్రంలో నటిస్తోంది.
నిధి డ్యాన్స్ రిహార్సల్స్
తెలుగు , కన్నడ , తమిళ భాషలలో ప్రావీణ్యం ఉన్న బిజినెస్ మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ అందాల నిధి అగర్వాల్ బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లలో ట్రైనింగ్ పొందారు. బాలీవుడ్ మూవీ "మున్నా మైఖేల్ "తో కెరీర్ ప్రారంభించారు. "సవ్యసాచి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిధి బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "తో గుర్తింపు పొందారు. ఒక తెలుగు మూవీ లో కథానాయికగా నటిస్తున్న నిధి , జయం రవి "భూమి ", శింబు "ఈశ్వరన్ "తమిళ మూవీస్ లో కథానాయికగా నటించారు.
ట్రెండింగ్ లో సాయి పల్లవి డ్యాన్స్ స్టెప్
మెడిసిన్ చదివిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీలో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం "విరాటపర్వం ", "లవ్ స్టోరీ ", "శ్యామ్ సింగ రాయ్ "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
కీర్తి సురేష్ నో మేకప్ సెల్ఫీ
"పైలట్స్ "మలయాళ మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ "గీతాంజలి " మలయాళ మూవీ తో హీరోయిన్ గా మారారు. "ఇదు ఎన్న మాయం "మూవీ తో కోలీవుడ్ , "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు కీర్తి సురేష్ కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఏడాది పూర్తి చేసుకున్న 'సరిలేరు నీకెవ్వరు'
సూపర్‌స్టార్‌మహేశ్ బాబుహీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజై నేటితో ఏడాది పూర్తిఅవుతున్నసందర్భంగా..

హీరో రామ్ 15 ఇయర్స్ సినీ కెరీర్ పూర్తి
ఎలమంచిలి గీత సమర్పణలో బొమ్మరిల్లు బ్యానర్ లో వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని , ఇలియానా జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ "దేవదాసు " మూవీ 2006 సంవత్సరంలో జనవరి 11వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో రామ్ , హీరోయిన్ ఇలియానా "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "రెడీ ", కందిరీగ ", "పండగ చేస్కో ","నేను శైలజ ", హలో గురు ప్రేమ కోసమే " వంటి సూపర్ హిట్ మూవీస్ తో హీరో రామ్ ప్రేక్షకులను అలరించారు.
నాకు నేనే పోటీ - రకుల్ ప్రీత్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన మూవీ షూటింగ్ ను రకుల్ కంప్లీట్ చేశారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న "చెక్ "మూవీ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. "అయిలాన్ ", "ఇండియన్ 2 "(తమిళ ), "ఎటాక్ ", "సర్దార్ &గ్రాండ్ సన్ ", మేడే "(హిందీ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రకుల్ మరో హిందీ మూవీ "థాంక్ గాడ్ " లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
రాజకీయాల్లోకి రాలేను.. అర్థంచేసుకోండి
తలైవా.. సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో తాను రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని .. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు ఇటీవలే ఒక లేఖలో తెలిపారు.
"లవ్ స్టోరీ " టీజర్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ" రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ , దర్శకుడు శేఖర్ కమ్ముల , సాయి పల్లవి సెకండ్ కాంబినేషన్ లో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? రిలీజ్ డేట్ ఫిక్స్
మేల్ యాంకర్స్ ఎంత మంది ఉన్నా తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ఒకే ఒక్క యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రదీప్ అని చెప్పొచ్చు. బుల్లితెరపై తన యాంకరింగ్ తో అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రదీప్ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు.
'చావు కబురు చల్లగా' టీజర్ గ్లింప్స్ రిలీజ్
ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో 'చావు కబురు చల్లగా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్, 'బస్తీ బాలరాజు' క్యారెక్టర్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మారిన రిలీజ్ డేట్
సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఘనంగా జరిగిన సునీత వివాహం
మొత్తానికి సింగర్ సింగర్ సునీత పెళ్లి ఘనంగా జరిగింది. సునీత-డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు.. వారికి అత్యంత సన్నిహితుల మధ్య శంషాబాద్ అమ్మపల్లి సీతారాముల ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక టాలీవుడ్ నుండి కూడా కరోనా వల్ల చాలా తక్కువమందే వివాహానికి హాజరైనట్టు తెలుస్తుంది. హీరో నితిన్ భార్య శాలినితో కలిసి ఈ వివాహానికి వచ్చారు. నిర్మాత దిల్ రాజు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు కొత్త జంటకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

"గుర్తుందా శీతాకాలం " సెట్స్ లో తమన్నా
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ హీరోయిన్ తమన్నా పలు మూవీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. "సీటీ మార్ "మూవీ తమన్నా కు ఫస్ట్ స్పోర్ట్స్ డ్రామా కావడం విశేషం. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" తెలుగు రీమేక్ , బ్లాక్ బస్టర్ "F 2 "మూవీ సీక్వెల్ "F 3 ", "గుర్తుందా శీతాకాలం" మూవీస్ లో నటిస్తున్నారు. "నవంబర్ స్టోరీ "తమిళ , "లెవెన్త్ అవర్ " తెలుగు వెబ్ సిరీస్ తో తమన్నా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కు…