రామ్ ‘రెడ్’ థ్రిల్లర్ మాత్రమే కాదు..!

Red Is Not Just A Thriller,latest telugu movies news, Latest Tollywood News, Ram Pothineni RED Telugu Movie, Ram Pothineni: RED Is Not Just A Thriller But Also A Perfect Family Entertainer For Sankranthi, red, Red Movie, RED Movie Updates, Red Telugu Movie, RED Telugu Movie Latest News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రెడ్ ‘. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్‌’ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌లతో పాటు ఈ సినిమాలో రామ్‌ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లు తిరిగి ప్రారంభం కావడంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న రామ్ తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. ఈ సినిమాలో రెండు పాత్రల్లో చేయడం చాలా ఎంజాయ్ చేశాను.. అంతేకాదు నేను నెగిటివ్ షేడ్ లో చేయడం వల్ల ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారో చూడాలి.. థ్రిల్లర్ జోనర్ కాబట్టే నేను ఈ సినిమాకు సైన్ చేసాను.. ముఖ్యంగా ఈ సినిమా థ్రిల్లర్ మాత్రమే కాదు మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కూడా.. అంతేకాదు కుటుంబసమేతంగా చూడాల్సిన సినిమా అదే అని.. మీరు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని థియేటర్ కు తీసుకెళ్ళండి.. అందరూ ఎంజాయ్ చేస్తారు అని తెలిపాడు.

కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్య‌ర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘రెడ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను రామ్ రీచ్ అవుతాడో లేదో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.