‘జాంబిరెడ్డి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Zombie Reddy Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Zombie Reddy,Zombie Reddy Movie,Zombie Reddy Telugu Movie,Zombie Reddy Movie,Zombie Reddy Release Date,Zombie Reddy Movie Release Date,Zombie Reddy Telugu Movie Release Date Locked,Zombie Reddy Telugu Movie Release Date Confirmed

కొత్త సంవత్సరంలో కొత్త సినిమాల సందడి మొదలైంది. వరుస పెట్టి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇక సంక్రాంతి బరిలో ఉన్న నాలుగు సినిమాల్లో ఒక సినిమా క్రాక్ ఇప్పటికే రిలీజ్ అయింది. అంతేకాదు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వీటితోపాటు మరికొన్ని సినిమాలు జనవరిలో రిలీజ్ అవ్వడానికి క్యూ కడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా స‌జ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘జాంబిరెడ్డి’. మొదటిసారి ఇలాంటి జోనర్లో సినిమా రావడంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్ పోస్టర్లకూ, మోష‌న్ పోస్టర్‌కూ అలాగే బిగ్ బైట్ అంటూ వచ్చిన వీడియో కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. మరి సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా ‘అ’ సినిమాతోనే తనలోని విభిన్నతను చూపించాడు. రెండో సినిమా కల్కి రాజశేఖర్‌తో చేసి ఆకర్షించారు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 8 =