మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్, తారాగణం తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న “ఆచార్య “మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. రామ్ చరణ్ హీరో గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆచార్య “మూవీ కై ఇండియా లోనే భారీ టెంపుల్ టౌన్ సెట్ రూపొందింది. ఈ సెట్లో చిరంజీవి , రామ్ చరణ్ లపై జనవరి మొదటి వారం లో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు శివ ప్లాన్ చేశారు. రామ్ చరణ్ కు కరోనా సోకడంతో ప్లాన్ అప్ సెట్ అయింది. తమ అభిమాన హీరోకు కరోనా అని తెలియగానే అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో రెండు సార్లు నెగటివ్ రావడం తో రామ్ చరణ్ కోలుకున్నారు. రామ్ చరణ్ కరోనా నుండి కొలు కున్న వార్త కు అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేశారు. జనవరి చివరి వారంలో గానీ ,ఫిబ్రవరి మొదటి వారం లో హీరో రామ్ చరణ్ “ఆచార్య “మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. “ఆచార్య “మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత రామ్ చరణ్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: