‘కపటధారి’ ట్రైలర్‌ రిలీజ్

Kapatadhari Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kapatadhari,Kapatadhari Movie,Kapatadhari Telugu Movie,Kapatadhari Movie Updates,Kapatadhari Telugu Movie Latest News,Kapatadhari Trailer,Kapatadhari Movie Trailer,Kapatadhari Telugu Movie Trailer,Kapatadhari Official Trailer

ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు ‘కపటధారి’ అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ట్రైలర్‌ను అక్కినేని నాగచైతన్య, సమంత చేతుల మీదుగా విడుదల చేశారు చిత్రయూనిట్. ఆసక్తిరేపే సంభాషణలు, సన్నివేశాలతో కపటధారి ట్రైలర్‌ ఉంది. మెట్రో లైన్ తవ్వకాల్లో కొన్ని అస్తిపంజరాలు బయటపడతాయి. అవి ఎవరివి? ఎవరు హత్య చేశారు? వంటి విషయాలతో సాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఈ సినిమా. మొత్తానికి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇంట్రెస్టింగ్ గానే వుంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు.

కాగా ఈ సినిమాను క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా… నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ వెర్ష‌న్‌లో ఇత‌ర న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుదలైన విజ‌య‌వంత‌మై అర్జున్‌, విజ‌య్ ఆంటోని `కిల్ల‌ర్‌`చిత్రంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించుకున్న‌సైమ‌న్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =