సింగర్ సునీత, డిజిటల్ కంపెనీ అధినేత రామ్ వీరపనేని వివాహం రెండు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే కదా. శంషాబాద్ దగ్గరలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వేదికగా వీరి పెళ్లి జరిగింది. ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు.. టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హ్యాపీనెస్ అనేది మన పుట్టుకతోనే రాదు… హ్యాపీనెస్ ను మనమే వెతుక్కోవాలి.. రామ్ వీరపనేని-సునీత ఇద్దరికీ కంగ్రాట్స్.. రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి… కాస్త ఆలోచించేవారికి ఎంతోమందికి మీరు ఆదర్శంగా నిలిచారు.. ప్రేమ, సంతోషం రెండూ మీ పర్మినెంట్ అడ్రస్ అవ్వాలని కోరుకుంటున్నా అని నవ దంపతులకు శుభాకాంక్షకులు తెలిపాడు.
Happy Married Life to You Two @OfficialSunitha & @ramveerapaneni pic.twitter.com/OEPMKxZnxl
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 12, 2021
డిసెంబర్‌లో సునీత-రామ్ వీరపనేని నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే సినీ పరిశ్రమలోని సన్నిహితులకు ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. సునీత, రామ్‌లు ఇద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి. సునీత 19 ఏళ్ళ వయస్సులో వివాహం చేసుకోగా.. తర్వాత కొన్నేళ్లకు భర్తతో విభేదాల నేపథ్యంలో డైవర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే.
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత ఇక తనకు ఇద్దరు పిల్లలు ఉండగా.. వారితోనే ఉంటుంది సునీత.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























