‘బంగారు బుల్లోడు’ రిలీజ్ డేట్ ఫిక్స్

Allari Naresh Starrer Bangaru Bullodu Movie Release Date Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Allari Naresh Starrer Bangaru Bullodu To Release On January 23,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bangaru Bullodu,Bangaru Bullodu Movie,Bangaru Bullodu Telugu Movie,Bangaru Bullodu Movie Updates,Bangaru Bullodu Telugu Movie Latest News,Bangaru Bullodu Telugu Movie Live Updates

ఇటీవల హీరోగా సరైన హిట్ లేక వెనకపడిపోయిన అల్లరి నరేశ్ తాజాగా ‘బంగారు బుల్లోడు’ సినిమాతో  రావడానికి సిద్ధమయ్యారు. గిరి ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బంగారు బుల్లోడు’. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఆ రోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తుంది. గత కొద్దిరోజులుగా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కొద్ది సేప‌టి క్రితం ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు చిత్రయూనిట్.

కాగా పూజా ఝవేరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, సత్యం రాజేశ్‌, ప్రభాస్‌ శ్రీను, జబర్దస్త్‌ మహేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘నాంది’ అనే సస్పెన్స్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే నాంది సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here