త్రివిక్రమ్ తో సినిమా ఉంది.. కానీ..!

Ram Pothineni Gives Clarity About His Movie With Star Director Trivikram Srinivas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni,Ram Pothineni Latest News,Ram Pothineni New Movie News,Ram Pothineni Upcoming Film Details On Cards

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ చాలా క్రేజీ గా ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్న మరో క్రేజీ కాంబినేషన్ త్రివిక్రమ్-రామ్ ది. గతకొద్ది రోజులుగా వీరిద్దరి కాంబినేషన్ పై సినిమా వస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈవిషయం పై క్లారిటీ ఇచ్చాడు రామ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రెడ్’ సినిమా జనవరి 14న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ ను త్రివిక్రమ్ తో సినిమా గురించి అడుగగా..ఇక దీనిపై రామ్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఈ మధ్యే కలిసి మాట్లాడుకున్నాం. మా ఇద్దరి కాంబినేషన్ లో కచ్చితంగా ఓ సినిమా వస్తుంది… అయితే అది ఎప్పుడన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేన`ని రామ్ క్లారిటీ ఇచ్చాడు. మరి చూద్దాం ఎప్పుడు వస్తుందో..

ఈ ఏడాది అల్లు అర్జున్ హీరోగా ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తన తర్వాతి ప్రాజెక్ట్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, త్రివిక్రమ్ హోమ్ ప్రొడక్షన్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కనుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి రావడంతో ఇప్పుడు ‘రెడ్’ సినిమా కు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటికే రామ్ లుక్స్ కు టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.మరి ఈ సినిమా రామ్ కు ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =