కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన “పెళ్ళి సందడి “(1996 ) మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులను అలరించిన “పెళ్ళి సందడి “మూవీ సీక్వెల్ “పెళ్ళిసందD” మూవీ తెరకెక్కుతుంది. ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోనంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా “పెళ్ళిసందD” మూవీ రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పెళ్ళిసందD” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా పలువురు పేర్లు వినిపించాయి ఫైనల్ గా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుందని రాఘవేంద్ర రావు ప్రకటించారు. “పెళ్ళిసందD” మూవీ మరో షూటింగ్ షెడ్యూల్ జనవరి 27 తేదీ జరగనుందని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో రోషన్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ “పెళ్ళిసందడి ” మూవీకి సంగీతం అందించిన కీరవాణి , 25 సంవత్సరాల తరువాత ఆ మూవీ సీక్వెల్“పెళ్ళిసందD” మూవీ కి సంగీతం అందించడం విశేషం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























