భాగ్యనగరంలో షూటింగ్స్ సందడి

Movie Shootings Resume Again In Hyderabad In Full Flow After Lockdown,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Movie Shootings Resume Again In Hyderabad,Movie Shootings In Hyderabad,Movie Shootings Resume Again In Telangana

కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలల పాటు చిత్ర పరిశ్రమ అనేక నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. థియేటర్స్ మూతబడి , షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు పలు ఇబ్బందులు పడ్డాయి. సినీ సెలబ్రిటీస్ షూటింగ్స్ లేక ఇళ్ళకే పరిమితం అయ్యారు. షూటింగ్స్ లేక స్టూడియోస్ , షూటింగ్ స్పాట్స్ కళ తప్పాయి. లాక్ డౌన్ సడలింపులలో షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో కొన్ని నెలల తరువాత షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. థియేటర్స్ ఓపెన్ కావడంతో ప్రేక్షకులు , నిర్మాతలు రిలీఫ్ ఫీల్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ లో ప్రస్తుతం తెలుగు , తమిళ , కన్నడ , హిందీ మూవీస్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ తో పాటు హైదరాబాద్ లో స్టూడియోస్ అన్నీ షూటింగ్స్ తో కళ కళ లాడుతున్నాయి. సినిమాలే కాకుండా టివి సీరియల్స్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కరోనా కారణంగా అవుట్ డోర్ షూటింగ్స్ సేఫ్ కాదనే కారణం తో స్టూడియోస్ లోని ఫ్లోర్స్ కు డిమాండ్ ఏర్పడింది. షూటింగ్స్ సందడి తో జూనియర్ ఆర్టిస్ట్స్ , సినీ కార్మికులు బిజీగా మారారు. కొత్త సినిమాలు రిలీజ్ తో థియేటర్స్ కూడా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. చిత్ర పరిశ్రమ త్వరలోనే పూర్వ వైభవం కు చేరుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =