
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 46


అల్లు అర్జున్ స్టైలిష్ లుక్

అంజలి ఏరియల్ యోగా స్కిల్స్

"లూసిఫర్ "మూవీ రీమేక్ కు ముహూర్తం ఫిక్స్

సీనియర్ నటి 'జయంతి' కన్నుమూత

"శాకుంతలం "లో యాంకర్ వర్షిణి కీలక పాత్ర

అయ్యప్పనుమ్ కోషియుమ్-షూటింగ్ షురూ చేసిన పవన్-రానా

'తిమ్మరుసు' సెన్సార్ పూర్తి

అభిమానులు కాలర్ ఎగరేసేలా "హరిహర వీర మల్లు "

గంగానదిపై కాజల్ ఫీలింగ్స్

అభిరామ్ కు విలన్ గా సముద్ర ఖని..!

సెప్టెంబర్ లో"#RC15"

'ఖిలాడి' షెడ్యూల్ లో మార్పు

భారీ క్లైమాక్స్ తో "అఖండ "

4 సంవత్సరాల "ఫిదా"

మెగా హీరోల 4 మూవీస్ కు థమన్ సంగీతం

మెహరీన్ శాండల్ వుడ్ ఎంట్రీ

"ఆదిపురుష్ "50 రోజుల షూటింగ్ పూర్తి

జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ

తెలంగాణ యాస నేర్చుకుంటున్న 'న్యాచురల్ స్టార్'
న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న టక్ జగదీష్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కరోనా వల్ల వాయాదా పడగా త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాలో నాని రాయలసీమ యాసలో మాట్లాడనున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైలిష్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు , మలయాళ ప్రేక్షకులనే కాదు డబ్బింగ్ మూవీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. 2020 సంవత్సరం బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. "మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ మూవీ లో నటిస్తున్నారు.

అంజలి ఏరియల్ యోగా స్కిల్స్
“ఫొటో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. . “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “, “గీతాంజలి “మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న అంజలి ప్రస్తుతం “ఆనందభైరవి “, “F 3 “, “పూచండి “(తమిళ ), “శివప్ప “(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు.

"లూసిఫర్ "మూవీ రీమేక్ కు ముహూర్తం ఫిక్స్
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ , ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ ని తెరకెక్కించనున్నారు.

సీనియర్ నటి 'జయంతి' కన్నుమూత
గత ఏడాది నుండి ఇప్పటివరకూ ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. చాలామంది కరోనాకారణంగా చనిపోతే మరికొంతమంది పలు అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ నటి మృతిచెందారు. గత కొద్దిరోజులుగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆమె నేడు బెంగుళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

"శాకుంతలం "లో యాంకర్ వర్షిణి కీలక పాత్ర
సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా నటిస్తున్న ఈ మూవీ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

అయ్యప్పనుమ్ కోషియుమ్-షూటింగ్ షురూ చేసిన పవన్-రానా
రీఎంట్రీ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ఫిక్సయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘వకీల్ సాబ్’ తర్వాత వరుస సినిమాలతో వచ్చేందుకు రెడీఅవుతున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలు చేస్తుండగా రెండు సినిమాలు షూటింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అయితే సెకండ్ వేవ్ రెండు సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే అన్ని సినిమాల షూటింగ్ లు మొదలవ్వగా నేడు ఈసినిమా షూటింగ్ కూడా రీస్టార్ట్ చేశారు చిత్రయూనిట్. హైద్రాబాద్ లో ప్రారంభమైన షూటింగ్ లో పవన్ నేటి నుండి పాల్గొననుండగా.. దాదాపు రెండు వారాల వరకూ ఈ షెడ్యూల్…

'తిమ్మరుసు' సెన్సార్ పూర్తి
ఇన్ని రోజులు మూతపడిన థియేటర్లు తెరుచుకుంటుండటంతో అన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తిమ్మరుసు కూడా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండి ఆ పనులను పూర్తిచేసుకున్న తిమ్మరుసు తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను ఇచ్చింది.

అభిమానులు కాలర్ ఎగరేసేలా "హరిహర వీర మల్లు "
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 50 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ మూవీ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం లో “PSPK 28 ” మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గంగానదిపై కాజల్ ఫీలింగ్స్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వివాహం తరువాత ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాజా శరవణన్ దర్శకత్వంలో తల్లీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ “రౌడీ బేబీ “తమిళ మూవీ లో కాజల్ తల్లి పాత్రలో నటిస్తున్నారు.

అభిరామ్ కు విలన్ గా సముద్ర ఖని..!
తన నటనతో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అల వైకుంఠపురములో, ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలు సముద్రఖని మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సముద్ర ఖని చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు విలన్ గా ఆయనే దాదాపు ఖరారైనట్టే అని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోనూ సముద్రఖని నటించనున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ లో"#RC15"
సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతమైన తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి.

'ఖిలాడి' షెడ్యూల్ లో మార్పు
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇంకా ఈసినిమాలో రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు పెండింగ్ లో ఉండగా దానికోసం దుబాయ్ లో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఆగష్ట్ ఫస్ట్ వీక్ నుండి ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ ను మార్చినట్టు తెలుస్తుంది. కరోనా వల్ల ఇంకా వీసా పర్మిషన్స్ రాకపోవడంతో ఇక్కడే సెట్స్ వేసి సాంగ్స్ వరకూ ఇక్కడే షూటింగ్ చేయాలని చూస్తున్నారట. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం దుబాయ్ లోనే షూట్ చేయనున్నారు

భారీ క్లైమాక్స్ తో "అఖండ "
నందమూరి బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలోహై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది.

4 సంవత్సరాల "ఫిదా"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన "ఫిదా " మూవీ 2017 సంవత్సరం జూలై 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. శక్తికాంత్ కార్తీక్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మెగా హీరోల 4 మూవీస్ కు థమన్ సంగీతం
సూపర్ హిట్ “భైరవ ద్వీపం”మూవీ తో థమన్ సహాయ సంగీత కళాకారుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “సింధనై సెయ్ “మూవీ తో కోలీవుడ్ , “మళ్ళీ మళ్ళీ “మూవీ తో టాలీవుడ్ కు థమన్ ఎస్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించిన థమన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా “దూకుడు “మూవీ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ 2020 సంవత్సరంలో 8 సినిమాలకు సంగీతం అందించారు.

మెహరీన్ శాండల్ వుడ్ ఎంట్రీ
పంజాబీ బ్యూటీ మెహరీన్ సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో మెహరీన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “నెంజిల్ తునివిరుందాయ్ “మూవీ తో కోలీవుడ్ కు , “డి ఎస్ పి దేవ్ ” మూవీ తో పంజాబీ చిత్రపరిశ్రమకు మెహరీన్ పరిచయం అయ్యారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “, మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న "మంచి రోజులు వచ్చాయి" మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

'7 డేస్ 6 నైట్స్' ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్
డర్టీ హరీ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు మరో డిఫరెంట్ యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో 7 డేస్… 6 నైట్స్ అనే సినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.

"ఆదిపురుష్ "50 రోజుల షూటింగ్ పూర్తి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో 300 కోట్ల బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ
తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ కథానాయికగా రూపొందిన 4 హిందీ , 2 తమిళ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాప్సీ ప్రస్తుతం“శభాష్ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. “కే 13” మూవీ ఫేమ్ భరత్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఏలియన్స్ నేపథ్యం లో ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అవుట్ సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని జీ…