సూపర్ హిట్ “భైరవ ద్వీపం”మూవీ తో థమన్ సహాయ సంగీత కళాకారుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “సింధనై సెయ్ “మూవీ తో కోలీవుడ్ , “మళ్ళీ మళ్ళీ “మూవీ తో టాలీవుడ్ కు థమన్ ఎస్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించిన థమన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా “దూకుడు “మూవీ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ 2020 సంవత్సరంలో 8 సినిమాలకు సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2020 సంవత్సరంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించిన “అల .. వైకుంఠపురము లో ” మూవీ ఘనవిజయం సాధించింది. థమన్ స్వరకల్పన లో సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొంది పలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. సక్సెస్ ఫుల్ చిత్ర సంగీత దర్శకుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్న థమన్ ఎస్ సంగీతం అందించిన “వకీల్ సాబ్ “, “క్రాక్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి. మెగాహీరోల 4 మూవీస్ కు థమన్ సంగీత దర్శకుడిగా ఎంపిక కావడం విశేషం. మెగా స్టార్ చిరంజీవి “లూసిఫర్ “తెలుగు రీమేక్ , పవన్ కళ్యాణ్ “అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ , రామ్ చరణ్ ” #RC15 ” , వరుణ్ తేజ్ “గని ” మూవీస్ కు థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ “అఖండ “, మహేష్ బాబు “సర్కారు వారి పాట “, నాని “టక్ జగదీష్ “, నాగచైతన్య “థ్యాంక్ యు “, అఖిల్ “ఏజెంట్ ” మూవీస్ కు థమన్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: